Rahat Fateh Ali Khan: శిష్యుణ్ని చెప్పుతో కొట్టిన ప్రముఖ సింగర్‌.. తర్వాత వివరణ!

Rahat Fateh Ali Khan: పాకిస్థాన్‌ సింగర్‌ రాహత్‌ ఫతేహ్‌ అలీ ఖాన్ తన శిష్యుణ్ని చెప్పుతో కొట్టారు. ఆ వీడియో వైరలైంది. దీంతో బాధితుడికి క్షమాపణలు చెప్పిన ఆయన.. ఘటనపై వివరణ ఇచ్చుకున్నారు.

Updated : 28 Jan 2024 10:18 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ గాయకుడు రాహత్‌ ఫతేహ్‌ అలీ ఖాన్ (Rahat Fateh Ali Khan) తన శిష్యుణ్ని చెప్పుతో కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాంట్లో ఉన్నది తానేనని ఫతేహ్‌ అలీ ఖాన్ ధ్రువీకరించారు. బాధితుడికి క్షమాపణలు చెప్పారు. ఒక బాటిల్ కనిపించకుండా పోయిన విషయంలో అతడిపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. తనని వదిలేయాలంటూ బాధితుడు ప్రాధేయపడుతుండటం ఆ వీడియోలో గమనించొచ్చు. సహనం కోల్పోయిన అలీ ఖాన్‌ను ఇతర సిబ్బంది నిలువరించారు. 

దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌ కావడంతో వివరణ ఇస్తూ అలీ ఖాన్‌ (Rahat Fateh Ali Khan) మరో వీడియో విడుదల చేశారు. ఇది గురు, శిష్యుల మధ్య విషయమని వ్యాఖ్యానించారు. బాధితుడు తన సొంత శిష్యుడేనని.. కుమారుడిలాంటి వాడని చెప్పుకొచ్చారు. శిష్యుడు తప్పు చేస్తే గురువు దండించినట్లుగానే దీన్ని భావించాలన్నారు. ఒకవేళ అతడు మంచి చేస్తే ప్రేమ కురిపిస్తానని.. తప్పు చేస్తే శిక్షిస్తానని అన్నారు. బాధితుడికి తర్వాత క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు.

యువతారలదే ఈ వేసవి

ఈ ఘటనపై వివరణ ఇచ్చిన వీడియోలో బాధితుడు కూడా మాట్లాడారు. పవిత్ర జలానికి సంబంధించిన ఓ బాటిల్ కనిపించకుండా పోవడానికి తానే కారణమని.. అందుకే ఫతేహ్‌ అలీ ఖాన్‌ దండించారని తెలిపారు. అంతకుమించి దీంట్లో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. అలీ ఖాన్‌ తనకు తండ్రిలాంటి వారని.. తమని చాలా ప్రేమిస్తారని చెప్పారు. తమ గురువు పరువుకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఎవరో ఈ వీడియోను వైరల్‌ చేశారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు