రాజ‘శేఖర్‌’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది!

సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ కొత్త సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్‌లుక్‌ను ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న రాజశేఖర్‌ నేడు 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 91వ చిత్రం టైటిల్‌ను ‘శేఖర్‌’గా

Published : 04 Feb 2021 12:44 IST

హైదరాబాద్‌: తన కొత్త సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన‌ నేడు 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 91వ చిత్రం టైటిల్‌ను ‘శేఖర్‌’గా ఖరారు చేశారు. నేటి నుంచి షూట్‌ మొదలవుతుందంటూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో పేర్కొన్నారు. తాను కరోనా నుంచి కోలుకోవడానికి అభిమానుల ప్రార్థనలు, ప్రేమే కారణమంటూ రాజశేఖర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత వచ్చిన మోషన్‌ పోస్టర్‌లో తీక్షణమైన చూపులతో మధ్యవయస్కుడి గెటప్‌లో  ఆయన ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్ర నేపథ్యం ఆయన యాంగ్రీ ఇమేజ్‌కు తగ్గట్టే ఉండబోతోందని అర్థమౌతోంది. ఈ చిత్రానికి లలిత్‌ దర్శకత్వం వహిస్తుండగా తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తున్నారు. రాజశేఖర్‌తో పాటు మరికొంతమంది భాగస్వామ్యంతో సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్‌‌ రూబెన్స్‌ బాణీలను సమకూరుస్తున్నారు. ఆ ఫస్ట్‌లుక్‌ను మీరూ చూసేయండి!

ఇవీ చదవండి!

భర్తతో విడిపోవడం బ్రేకప్‌లా ఉంది: శ్వేతాబసుప్రసాద్‌

‘ఖిలాడి’తో అనసూయ ఆట


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని