Ram charan: రామ్ చరణ్‌ దంపతులకు ‘అయోధ్య’కు ఆహ్వానం

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రామ్‌చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది.

Updated : 13 Jan 2024 15:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు రామ్‌చరణ్‌ దంపతులకు ఆహ్వానం అందింది. ఈ మహత్కార్యాన్ని వీక్షించేందుకు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్‌చరణ్‌-ఉపాసనలను రామమందిర ట్రస్టు ప్రతినిధులు శుక్రవారం ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన అభిమానులు పంచుకుంటున్నారు.

ఇప్పటివరకు చిరంజీవి, ప్రభాస్‌, అమితాబ్ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ దంపతులు, రాజ్‌కుమార్‌ హిరాణీ, రోహిత్‌ శెట్టి, ధనుష్‌ తదితరులు ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందుకున్నారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ సందేశం ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవానికి దేశ ప్రజల తరఫున ప్రతినిధిగా ఉండటం తన అదృష్టమని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని 11 రోజుల పాటు ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఒక పవిత్రమైన సందర్భమన్నారు. మరోవైపు ‘హనుమాన్‌’ ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన రూ.14.25 లక్షలను అయోధ్య రామ మందిర నిర్మాణానికి చిత్రబృందం విరాళంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని