Raviteja: నేను లక్‌పై ఆధారపడేవాడ్ని కాదు.. రవితేజ ‘మాస్‌ నోటీస్‌’!

రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్‌ కథా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. ప్రభుత్వ అధికారిగా రవితేజ నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది.

Published : 27 Jul 2022 15:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ (Raviteja) హీరోగా రూపొందిన యాక్షన్‌ కథా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (RamaRao On Duty). ప్రభుత్వ అధికారిగా రవితేజ నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘మాస్‌ నోటీస్‌’ పేరుతో చిత్ర బృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. పోరాట దృశ్యాలు, పవర్‌ ఫుల్‌ సంభాషణలతో రూపొందిన ఈ వీడియో అన్ని వర్గాల వారిని మెప్పించేలా ఉంది. ముఖ్యంగా, ‘నేను లక్‌ మీద, లాటరీల మీద డిపెండ్‌ అయ్యేవాడ్ని కాదు నా వర్క్‌ మీద డిపెండ్‌ అయ్యేవాడ్ని’ అని రవితేజ ఇచ్చిన స్వీట్‌ వార్నింగ్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. తొట్టెంపూడి వేణు, రజిషా విజయన్‌, తనికెళ్ల భరణి తదితరుల పాత్రలకు సంబంధించిన కొన్ని షాట్స్‌ను ఈ వీడియోలో చూపించారు. మరి, రవితేజ చేసిన ఆ డ్యూటీ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. శరత్‌ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సామ్‌ సి. ఎ. ఎస్‌. సంగీతం అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని