Ramcharan: సందడిగా రామ్‌చరణ్ బర్త్‌డే పార్టీ.. బేబీ బంప్‌తో కన్పించిన ఉపాసన
రామ్ చరణ్ (Ramcharan) బర్త్‌డే వేడుకలకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) 38వ పుట్టిన రోజు వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ బర్త్‌డే పార్టీకి దర్శకనిర్మాతలతో పాటు టాలీవుడ్ నటీనటులు హాజరై సందడి చేశారు. రామ్ చరణ్ భార్య ఉపాసన (Upasana Kamineni) బేబి బంప్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాగార్జున (Nagarjuna), రాజమౌళి, కీరవాణి పలువురు ప్రముఖులు కుటుంసమేతంగా హాజరవ్వగా కాలభైరవ ప్రత్యేకంగా తయారుచేయించిన గిఫ్ట్‌తో రామ్‌చరణ్‌ను సర్‌ప్రైజ్ చేశాడు. యంగ్ హీరోలు నిఖిల్, అడివి శేష్‌లు ఈ పార్టీలో కనిపించారు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వైట్ డ్రెస్‌లో స్టైల్‌గా కనిపించగా.. చందమామ భామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన భర్తతో పాటు వేడకలో మెరిసింది. ప్రస్తుతం ఈ బర్త్‌డే పార్టీ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.
హాలీవుడ్ సైన్ పై
ఇక రెండు తెలుగు రాష్రాలతో పాటు అటు అమెరికాలోనూ రామ్ చరణ్ బర్త్‌డే వేడుకను (Ramcharan birthday) మెగా ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించారు. హాలీవుడ్ సైన్ పై ‘హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్’ అనే బ్యానర్‌ను విమానం సహాయంతో ఎగురవేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి వారికి థ్యాంక్స్ చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో ఇందూరు వాసి మృతి
-
Ap-top-news News
Heat waves: సన్డే.. మండే.. ఏపీలో భగభగలే
-
Ap-top-news News
YSRCP: లాగిపడేయండి.. సస్పెండ్ చేస్తా: అధికార పార్టీ కార్పొరేటర్‌పై మేయర్ వ్యాఖ్యలు
-
India News
Indian Railway Accidents: భారతీయ రైల్వేలో మహా విషాదాలివీ..