Rangabali Trailer: సొంతూరులో సింహంలా

వ్యక్తిగతంగా నాకు దగ్గరగా ఉన్న పాత్రని ఇందులో పోషించానని చెప్పారు నాగశౌర్య. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రంగబలి’. యుక్తి తరేజా కథానాయిక. పవన్‌ బాసంశెట్టి దర్శకత్వం వహించారు.

Updated : 29 Jun 2023 17:28 IST

వ్యక్తిగతంగా నాకు దగ్గరగా ఉన్న పాత్రని ఇందులో పోషించానని చెప్పారు నాగశౌర్య (Naga Shaurya). ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రంగబలి’ (Rangabali). యుక్తి తరేజా కథానాయిక. పవన్‌ బాసంశెట్టి దర్శకత్వం వహించారు. ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. జులై 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘‘ప్రతి మనిషి పేరుమీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు, సొంత పొలం ఉండకపోవచ్చు. కానీ సొంతూరైతే ఉంటుందండీ’ అనే సంభాషణతో ట్రైలర్‌ మొదలవుతుంది. బయట ఊర్లో బానిసలా బతికినా పర్లేదు, కానీ  సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలనుకునే ఓ కుర్రాడి చుట్టూ సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కినట్టు స్పష్టమవుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో నాగశౌర్య మాట్లాడుతూ ‘‘సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నా. యుక్తి ఎంతో అందంగా ఉంది. మా ఇద్దరి జోడీ కూడా తెరపై బాగుంటుంది’’ అన్నారు.

ఆ అమ్మాయిదే తప్పు: నాగశౌర్య

కొన్ని రోజుల కిందట కూకట్‌పల్లిలో రోడ్డుపై జరిగిన గొడవ గురించి విలేకర్లు అడదిగిన ప్రశ్నకి నాగశౌర్య బదులిచ్చారు. ‘‘నేను ఓ రోజు కూకట్‌పల్లిలో వెళుతుండగా రోడ్డుపై ఓ అబ్బాయి అమ్మాయిని కొడుతూ కనిపించాడు. వెంటనే అక్కడికి వెళ్లి ‘ఎందుకు కొడుతున్నావు? సారీ చెప్పు’ అన్నా. కానీ ఆ అమ్మాయి ‘నా బాయ్‌ఫ్రెండ్‌ కొడితే కొడతాడు’ అంటూ బదులిచ్చింది. అలా చెప్పాక ఇంకేం అంటాం. కానీ నేనొక్కటే చెప్పేది. కొట్టే అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు. అది అమ్మాయిలకీ, వాళ్ల కుటుంబానికి మంచిది కాదు. ఆ రోజు సంఘటనలో అమ్మాయిదే తప్పు’’ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని