Rashmika: మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది : రష్మిక
చిన్న సినిమాగా విడుదలైన ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan) అందరి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసి పలువురు నటీనటులు వాళ్ల రివ్యూను ట్వీట్ చేశారు.
హైదరాబాద్: ‘కలర్‌ఫొటో’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ (Suhas).. ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan)తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సందేశాత్మక చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై సినీప్రముఖులు ప్రశంసలు కురింపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్‌లో నేషనల్ క్రష్ రష్మిక, మాస్ మహారాజ్ రవితేజ చేరారు.
తాజాగా ఈ సినిమా చూసిన రష్మిక (rashmika) తనకు సినిమా ఎంతో నచ్చిందని తెలిపింది. అందమైన చిత్రాన్ని తీశారంటూ పొడగ్తల వర్షం కురిపించింది. ‘‘మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇంత భారీ విజయాన్ని సాధించినందుకు మీ అందరికీ అభినందనలు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. ముఖ్యంగా మహిళలు ఈ సినిమాను కచ్చితంగా చూడాలి’’ అని రష్మిక తెలిపింది. ఇక రవితేజ (Raviteja) కూడా ఈ చిత్రాన్ని కొనియాడారు. సుహాస్ నటన అద్భుతంగా ఉందని.. సినిమా చూసినంతసేపు ఎంజాయ్ చేశానన్నారు. క్లైమాక్స్ హృదయానికి హత్తుకునేలా ఉందన్నారు. అందరూ ఈ సినిమా చూడాలని ఆయన కోరారు. హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) కూడా ఈ సినిమాపై తన రివ్యూ తెలియజేశాడు. ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాకు వచ్చిన స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. కుటుంబసభ్యులతో కలిసి చూసే సినిమా అని అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: తితిదేకి రూ.3 కోట్ల జరిమానా.. చెల్లించామన్న సుబ్బారెడ్డి
-
India News
Rahul Gandhi: ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయండి.. రాహుల్‌గాంధీకి నోటీసులు
-
Movies News
Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!
-
India News
Amritpal Singh: భారత్ ‘హద్దులు’ దాటిన అమృత్‌పాల్..!
-
General News
Hyd Airport MetroP: ఎయిర్‌పోర్టు మెట్రో కోసం భూ సామర్థ్య పరీక్షలు
-
Sports News
Dhoni - IPL: పెయింటర్‌గానూ అదరగొట్టిన ధోనీ.. వీడియో వైరల్!