Prabhas: ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ ఎంపికకు కారణాలు ఇవేనా...!

‘బాహుబలి, బహుబలి-2’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో ప్రభాస్‌. ఈ పాన్‌ ఇండియా స్టార్‌కి భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్‌’.

Updated : 28 Sep 2022 12:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘బాహుబలి, బహుబలి-2’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో ప్రభాస్‌. ఈ పాన్‌ ఇండియా స్టార్‌కి భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం అతడు హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ సినిమాలో అతడు రాముడిగా కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ప్రభాస్‌ని ఎంచుకోవడం పై పలు ఆసక్తికరవిషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అతడికున్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాల వల్లే తనని ఈ పాత్రకు దర్శకుడు ఎంపిక చేశారంటున్నారు ఫ్యాన్స్. అవేంటో మీరు చూసేయండి.

సహనం: బాహుబలి సినిమాలు తీయడానికి సంవత్సరాల సమయం పట్టింది. వాటి విడుదల కోసం ఓపిగ్గా ఎదురుచూశాడు కాబట్టి .. ఈ రోజు ప్రపంచస్థాయిలో గుర్తింపునందుకున్నాడు. అదే అతడి జీవితంలో అతిపెద్ద లక్ష్యాలు సాధించడంలో సహాయపడింది.

ఒదిగి ఉండే తత్వం: ప్రభాస్‌ తన అభిమానులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. అభిమానులు అతడిని కలవడం కోసం గంటలు, రోజుల తరబడి నడిచి వస్తుంటారు. వాళ్లపట్ల ప్రభాస్‌ చూపే ప్రేమ.. వెలకట్టలేనిది. ఇక అభిమానులతో ఓపిగ్గా మాట్లాడే తీరు కూడా ఆకట్టుకుంటుంది.

సినిమాలపై ఉండే తపన: ప్రభాస్‌ తాను చేసే పనిని ప్రేమిస్తాడు. విభిన్నమైన పాత్రల్లో నటించడానికి ఇష్టపడతాడు. తనకు సినిమాలపై ఉన్న ఇష్టం కారణంగానే ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

అంకితభావం: చేసే పనిపై అంకితభావం ఉంటే వాళ్లు లక్ష్యాలను సాధిస్తారంటారు. ప్రభాస్‌ బాహుబలి సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు మరే ఇతర సినిమాలను ఒప్పుకోకుండా దానికోసం మాత్రమే పనిచేశాడు.

ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఆదిపురుష్‌లో రాముడి పాత్ర కోసం ప్రభాస్‌ను ఎంపిక చేశారంటూ ఫ్యాన్స్‌ సోషల్ మీడియా వేదికగా వాళ్ల  అభిప్రాయాలను తెలుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని