RGV: ఆర్జీవీ లైవ్‌ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌.. వీడియో వైరల్‌

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనలోని కొత్త టాలెంట్‌ని మరోసారి బయటపెట్టారు. లైవ్‌లో అందరి ముందు డ్యాన్స్‌ చేసి మెప్పించారు. బయోపిక్‌లు తీయడంలో....

Published : 19 Jun 2022 11:00 IST

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనలోని కొత్త టాలెంట్‌ను మరోసారి బయటపెట్టారు. లైవ్‌లో అందరి ముందు డ్యాన్స్‌ చేసి మెప్పించారు. బయోపిక్‌లు తీయడంలో తన మార్క్‌ను చూపించే ఆర్జీవీ దర్శకత్వం వహించిన కొత్త చిత్రం ‘కొండా’. కొండా మురళి - సురేఖ దంపతుల జీవితకథతో దీనిని రూపొందించారు. త్రిగుణ్‌, ఇర్రా మోర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. జూన్‌ 23న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈనేపథ్యంలోనే  ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక శనివారం సాయంత్రం హన్మకొండలో జరిగింది. ఈ ఈవెంట్‌లో చిత్రబృందంతోపాటు కొండా దంపతులు సందడి చేశారు. కాగా, ఈవెంట్‌లో పాల్గొన్న వారికి ఆర్జీవీ స్పెషల్‌ ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమాలోని ఓ పాటకు లైవ్‌లో ఆయన డ్యాన్స్‌ చేశారు. ఓ ఈవెంట్‌లో ఇలా డ్యాన్స్‌ చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘వర్మ సారూ.. ఏం చేసినా వైరల్‌ కావాల్సిందే’’ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక, గతంలోనూ ‘బ్యూటీఫుల్‌’ ప్రెస్‌మీట్‌లో వర్మ డ్యాన్స్ చేసి అలరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని