Indian Police Force: పవర్‌ఫుల్‌గా ‘ఇండియన్‌ పోలీస్ ఫోర్స్‌’ టీజర్..

సిద్ధార్థ్‌ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ (Indian Police Force). తాజాగా దీని టీజర్‌ విడుదలైంది.

Published : 16 Dec 2023 15:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పవర్‌ఫుల్‌ చిత్రాల దర్శకుడిగా రోహిత్‌ శెట్టి (Rohit Shetty) గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తొలిసారి రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ (Indian Police Force). ఈ సిరీస్‌తో ఆయన ఓటీటీలోకి అడుగుపెట్టనున్నారు. ఈ పోలీస్‌ డ్రామాలో సిద్ధార్థ్‌ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. జనవరి 19 నుంచి ఈ యాక్షన్‌ డ్రామా అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా దీని టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రోహిత్‌ శెట్టి మాట్లాడుతూ.. ‘మన భారతీయ పోలీసు అధికారుల పరాక్రమం, త్యాగం, ధైర్యాన్ని ఇందులో చూపించనున్నాం. దీని కోసం అంకితభావంతో పనిచేసిన టీమ్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది. నా మొదటి సిరీస్‌ అమెజాన్‌లో ప్రసారం కావడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఆ పవర్‌ఫుల్‌ టీజర్‌ను మీరు చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని