Rowdy Boys: ‘రౌడీబాయ్స్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే?

‘రౌడీబాయ్స్‌’ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. ‘జీ 5’లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్‌కానుంది.

Published : 01 Mar 2022 01:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రౌడీబాయ్స్‌’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ‘జీ 5’లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఆశిష్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ చిత్రమిది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై, విజయం అందుకుంది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.

క‌థేంటంటే..

ఏ బాధ్య‌తా తెలియ‌ని, జీవితం ప‌ట్ల ఓ స్ప‌ష్ట‌త లేని కుర్రాడు అక్ష‌య్ (ఆశిష్‌). లెగ‌సీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చ‌దువుతుంటాడు. కాలేజీలో చేరిన తొలిరోజే కావ్య (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌)ను చూసి మ‌న‌సు పారేసుకుంటాడు. కానీ, కావ్య మెడిక‌ల్ స్టూడెంట్‌. ఆశిష్ చదువుతున్న ఎదురు కాలేజీలోనే చ‌దువుతుంటుంది. ఆ రెండు కాలేజీల విద్యార్థుల‌ మధ్య గ్యాంగ్ వార్ న‌డుస్తుంటుంది. ఎప్పుడు ఎదురు ప‌డినా కొట్టుకుంటూనే ఉంటారు. కావ్య క్లాస్‌మేట్‌ విక్ర‌మ్ (విక్ర‌మ్ స‌హిదేవ్‌) కూడా ఆమెని ప్రేమిస్తుంటాడు. కావ్య‌ని అక్ష‌య్ ఇష్ట‌ప‌డుతున్నాడ‌ని తెలిశాక‌.. విక్ర‌మ్ అత‌డిపై ప‌గ సాధించే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఓరోజు ర‌హ‌స్యంగా మెడిక‌ల్ కాలేజీలోకి  ప్ర‌వేశించే ప్ర‌య‌త్నం చేసిన అక్ష‌య్‌ను కొడతాడు. అనంత‌రం జ‌రిగిన కొన్ని నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య కావ్య‌, అక్ష‌య్‌తో లివింగ్ రిలేష‌న్‌షిప్‌లో ఉండేందుకు అంగీక‌రిస్తుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? వాళ్ల ప్రేమ‌కు ఎలాంటి స‌వాళ్లెదుర‌య్యాయి? ఆఖ‌రికి ఈ రౌడీబాయ్స్ క‌థ‌లు ఏ కంచికి చేరాయి? అనేది మిగతా కథ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని