RRR: స్పెషల్‌ షాట్స్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీ ట్రైలర్‌

రామ్‌చరణ్‌, తారక్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ జీ5 వేదికగా మే 20 నుంచి దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో .....

Published : 13 May 2022 11:41 IST

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌, తారక్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ జీ5 వేదికగా మే 20 నుంచి దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సరికొత్త ట్రైలర్‌ని జీ5 షేర్‌ చేసింది. ఒరిజినల్‌ ట్రైలర్‌లోని పలు సన్నివేశాలతోపాటు మరికొన్ని స్పెషల్‌ షాట్స్‌తో ఈ ఓటీటీ ట్రైలర్‌ సిద్ధమైంది. అడవిలో ఓ చిన్న తండా, అందులో చిరునవ్వులు పూయించే ఓ చిన్నారిని చూపిస్తూ ప్రారంభించిన ఈ ట్రైలర్‌లో రామ్‌-భీమ్‌ కలుసుకోవడం, వాళ్ల మధ్యే పోరాటం, వాళ్లిద్దరూ కలిసి ఆంగ్లేయులపై యుద్ధం చేయడం.. ఇలా పలు పవర్‌ఫుల్‌ షాట్స్‌ని ఇందులో చూపించారు. ‘‘ప్రతి తూటా మీద చచ్చేవాడి పేరు రాసుంటుంది. ప్రతి తుపాకీ మీద పేల్చే వాడి పేరుంటుంది’’, ‘‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి’’ వంటి పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో హాలీవుడ్‌, బాలీవుడ్‌ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈచిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని