RRR: స్పెషల్ షాట్స్‌తో ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ ట్రైలర్
రామ్‌చరణ్, తారక్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 వేదికగా మే 20 నుంచి దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో .....
హైదరాబాద్: రామ్‌చరణ్, తారక్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 వేదికగా మే 20 నుంచి దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త ట్రైలర్‌ని జీ5 షేర్ చేసింది. ఒరిజినల్ ట్రైలర్‌లోని పలు సన్నివేశాలతోపాటు మరికొన్ని స్పెషల్ షాట్స్‌తో ఈ ఓటీటీ ట్రైలర్ సిద్ధమైంది. అడవిలో ఓ చిన్న తండా, అందులో చిరునవ్వులు పూయించే ఓ చిన్నారిని చూపిస్తూ ప్రారంభించిన ఈ ట్రైలర్లో రామ్-భీమ్ కలుసుకోవడం, వాళ్ల మధ్యే పోరాటం, వాళ్లిద్దరూ కలిసి ఆంగ్లేయులపై యుద్ధం చేయడం.. ఇలా పలు పవర్ఫుల్ షాట్స్‌ని ఇందులో చూపించారు. ‘‘ప్రతి తూటా మీద చచ్చేవాడి పేరు రాసుంటుంది. ప్రతి తుపాకీ మీద పేల్చే వాడి పేరుంటుంది’’, ‘‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి’’ వంటి పవర్ఫుల్ డైలాగ్స్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో హాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్‌కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్‌సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
ఈటీవీ విన్లో ఆకట్టుకుంటోన్న క్రైమ్ కామెడీ చిత్రం
ఈటీవీ విన్ వేదికగా విడుదలైన 'శర్మ & అంబానీ' ప్రేక్షకాదరణ పొందుతోంది. -
ఓటీటీలో ‘గామి’ సరికొత్త రికార్డు.. ఎన్ని మిలియన్ల వీక్షణలంటే..
‘గామి’ ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ జీ5 సంస్థ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. -
ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కన్నడ నటుడు దర్శన్ (Darshan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాటేరా’ (Kaatera) -
ఓటీటీలోకి ‘భీమా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘భీమా’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కీర్తి సురేశ్ ఎమోషనల్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
కీర్తి సురేశ్ నటించిన ‘సైరన్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. -
‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్‌పై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
అఖిల్ నటించిన ‘ఏజెంట్’ ఓటీటీ విడుదలపై నిర్మాత మరోసారి స్పందించారు. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
‘ఓం భీమ్ బుష్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానుంది. -
ఓటీటీలోకి ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
ఇటీవల కాలంలో యూత్‌ను బాగా ఆకర్షించిన మలయాళీ ప్రేమకథా చిత్రం ‘ప్రేమలు’. ఇప్పుడు ఇది ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. -
ఈ వారం ఓటీటీలో సినిమాలే సినిమాలు.. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?
బయట ఎండలు మండిపోతున్నాయి. థియేటర్లో వరుస చిత్రాలు సందడి చేస్తున్నాయి. అయినా, ప్రతీ వారం ఇంటికి వచ్చి మరీ వినోదాన్ని పంచుతున్నాయి ఓటీటీ చిత్రాలు. మరి ఈ వారం ఏ ఓటీటీ వేదికగా ఏ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేయండి. -
‘సేవ్ ది టైగర్స్2’ రికార్డు.. ఇండియాలోనే టాప్..
కుటుంబ ప్రేక్షకులను అలరించిన సేవ్ ది టైగర్స్ సీజన్2 రికార్డు సృష్టించింది. -
ఓటీటీలో ‘ఫైటర్’ రికార్డులు.. ఆ హాలీవుడ్ మూవీని దాటేసింది!
Fighter ott: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హృతిక్ రోషన్ ‘ఫైటర్’ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
ఓటీటీలోకి విశ్వక్సేన్ ‘గామి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
విశ్వక్సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘గామి’ (Gaami). తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ విడుదలైంది. -
న్యూ ఏజ్ లవ్‌స్టోరీ ‘ప్రేమలు’.. ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది!
premalu ott release date telugu: యువతను విశేషంగా ఆకట్టుకున్న సరికొత్త చిత్రం ‘ప్రేమలు’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ఎట్టకేలకు ఓటీటీలో వస్తున్న కాజల్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కాజల్, రెజీనా కీలక పాత్రల్లో నటించిన ‘కార్తీక’ మూవీ తెలుగులో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ధన్య బాలకృష్ణన్ కొత్త వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సరికొత్త సిరీస్‌లు, సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఈటీవీ విన్లో మరో ఆసక్తికర సిరీస్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
‘తంత్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన ‘తంత్ర’ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం