RRR: కొమురం భీమ్‌ని చూశారా!

‘వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తగిన మన్యం ముద్దుబిడ్డ. నా తమ్ముడు గొండు బెబ్బులి కొమురం భీమ్’ అంటూ గతేడాది రామ్‌చరణ్‌ వాయిస్‌తో తారక్‌ పాత్రను....

Updated : 20 May 2021 10:25 IST

హైదరాబాద్‌: ‘వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తగిన మన్యం ముద్దుబిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీమ్’ అంటూ గతేడాది రామ్‌చరణ్‌ వాయిస్‌తో తారక్‌ పాత్రను అభిమానులకు పరిచయం చేసింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌. గురువారం ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్‌తో యంగ్‌ టైగర్‌ అభిమానుల్ని మరోసారి ఫిదా చేసింది ఈ టీమ్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఓ సరికొత్త లుక్‌ను నెట్టింట్లో షేర్‌ చేసింది. ఇందులో ఎన్టీఆర్‌ ఉగ్రరూపంలో కనిపించారు. బల్లెం గురిపెట్టి పోరాటానికి సిద్ధమైనట్లు ఉన్న ఎన్టీఆర్‌ లుక్‌ పోస్టర్‌ ప్రతిఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది.

‘మా భీమ్‌ది బంగారులాంటి మనస్సు. కానీ, ఆయనే కనుక తిరుగుబాటు చేస్తే బలం, ధైర్యంగా నిలుస్తాడు’ అని రాజమౌళి ట్వీట్‌ చేశారు. 

యాక్షన్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ మరో కథానాయకుడిగా కనిపించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌ను రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌, రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ భామ ఆలియాభట్‌ సందడి చేయనున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌, హాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని