RRR: ‘బాహుబలి 2’ వర్సెస్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యాక్షన్‌ .. వావ్‌ అనిపించే ఎన్టీఆర్‌ ఎంట్రీ సీన్‌!

‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. తెలుగులో రూపొంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చిత్రాలివి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ రెండు సినిమాలు భారీ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డులు సృష్టించాయి.

Published : 07 Jun 2022 16:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బాహుబలి 2’ (Baahubali), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR).. తెలుగులో రూపొంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చిత్రాలివి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ రెండు సినిమాలు భారీ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డులు సృష్టించాయి. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (హిందీ వెర్షన్‌) ఇటీవల ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అత్యధిక వ్యూస్‌ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ఇంకా మరింత మందికి చేరువ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ విభిన్న రకాలుగా ప్రచారం చేస్తోంది. ఈ మేరకు.. ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్‌ సీన్‌, నాటు నాటు పాటకు సంబంధించిన సన్నివేశాన్ని కొన్ని రోజుల క్రితమే విడుదల చేసింది. ఎన్టీఆర్‌ ఎంట్రీ సీన్‌తోపాటు ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలను ‘బాహుబలి 2’లోని పోరాట దృశ్యాలతో ముడిపెట్టి రూపొందించిన వీడియోలను నెట్‌ఫ్లిక్స్‌ ఇటీవల రిలీజ్ చేసింది. ఈ రెండు యాక్షన్‌ వీడియోలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఆసక్తికర వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి..



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని