Guntur Kaaram: మహేశ్‌ ‘గుంటూరు కారం’.. ఆ వార్తల్లో నిజమెంత?

‘గుంటూరు కారం’ విషయంలో మరో రూమర్‌ వినిపిస్తోంది. అందులో వాస్తవమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.

Published : 24 Jun 2023 01:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు మహేశ్‌ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం.. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sree Leela) కథానాయికలుగా నటిస్తున్నారని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. వివరాలు తెలియదుగానీ ఈ చిత్రంలో పూజా హెగ్డే నటించే అవకాశం లేదంటూ కొన్ని రోజుల క్రితం సినీ వర్గాల్లో వినిపించింది. ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ని ఎంపిక చేయబోతున్నారంటూ పలు వెబ్‌సైట్లు సైతం కథనాలు రాశాయి. ఇప్పుడు ఆ పేరు బయటకు వచ్చింది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని తీసుకునేందుకు ‘గుంటూరు కారం’ టీమ్‌ ఆసక్తి చూపుతుందని తాజా సమాచారం. ముందుగా సెకండ్‌ హీరోయిన్‌గా తీసుకున్న శ్రీలీలను ఇప్పుడు ప్రధాన నాయికగా మార్చి.. మీనాక్షిని రెండో హీరోయిన్‌గా తీసుకోబోతున్నారట. మరి, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. ఈ సినిమా సంగీత దర్శకుడి విషయంలోనూ ఇటీవల నెట్టింట రూమర్లు వచ్చాయి. తమన్‌ స్థానంలో వేరే మ్యూజిక్‌ డైరెక్టర్‌ని తీసుకుంటున్నారనేది వాటి సారాంశం. దానిపై స్పందించిన నిర్మాత నాగవంశీ వాటిని ఖండించారు. అలాంటి వదంతులు సృష్టించే వారిపై తమన్‌ తనదైన శైలిలో ట్విటర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు.

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ (ichata vahanamulu niluparadu) తో తెలుగు తెరకు పరిచయమై, తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకుంది మీనాక్షి చౌదరి. ఆ తర్వాత ‘హిట్‌ 2’, ‘ఖిలాడి’ చిత్రాల్లో సందడి చేసింది. ‘అత‌డు’, ‘ఖ‌లేజా’ త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో ‘గుంటూరు కారం’ ప్రకటన వెలువడిన క్షణం నుంచే సినీ అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాని విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని