కీర్తి.. కొత్త ప్రయాణం

కమర్షియల్‌ చిత్రాల్లో అందంగా కనిపిస్తూనే కథా బలం ఉన్న సినిమాల్లో డీ గ్లామర్‌గా కనిపించేందుకు ముస్తాబవుతున్నారు నాయిక కీర్తి సురేశ్‌. కీర్తి ప్రధాన పాత్రలో విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘సాని కాయిదం’.

Published : 27 Feb 2021 00:53 IST

చెన్నై‌: కమర్షియల్‌ చిత్రాల్లో అందంగా కనిపిస్తూనే కథా బలం ఉన్న సినిమాల్లో డీ గ్లామర్‌గా కనిపించేందుకు సిద్ధంగా ఉంటారు నాయిక కీర్తి సురేశ్‌. ఇప్పటికే పలు నాయికా ప్రాధాన్య చిత్రాల్లో నటించిన ఆమె మరో సినిమాతో వస్తున్నారు. కీర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘సాని కాయిదం’. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. సంబంధిత ఫొటోల్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు కీర్తి సురేశ్‌. ‘మేము మరో ప్రయాణం మొదలుపెట్టాం. మీ ఆశీస్సులు కావాలి’ అని ట్వీట్‌ చేశారామె. ఈ సినిమాలో కీర్తి ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో నటిస్తుందని సమాచారం. స్ర్కీన్‌ సీన్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం: యామిని, కూర్పు: నగూర, కళ: రాము తంగరాజ్‌.

గతేడాది విడుదలైన కీర్తి, రాఘవన్‌ల ఫస్ట్‌లుక్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు మహేశ్‌ బాబు కథానాయకుడుగా తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్నారు కీర్తి. ఇటీవలే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుందా చిత్రం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని