Sai Dharam Tej: చిట్‌చాట్‌లో ₹10 లక్షలు అడిగిన నెటిజన్‌.. సాయిధరమ్‌ తేజ్‌ రియాక్షన్‌ ఏంటంటే?

తాను టాలీవుడ్‌కు పరిచయమై 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సాయిధరమ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఆ విశేషాలివీ..

Published : 15 Nov 2023 02:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొమ్మిదేళ్లు పూర్తయింది (9YearsForSDTinTFI). ‘పిల్లా.. నువ్వులేని జీవితం’ (Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో 2014 నవంబరు 14న ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారాయన. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా #AskSDT పేరుతో అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో తనకు రూ.10 లక్షలు కావాలంటూ ఓ నెటిజన్‌ అడిగాడు. దీంతోపాటు ఇతర ప్రశ్నలకు ఈ హీరో ఎలా స్పందించారంటే..

* బ్రో.. మీ పెళ్లి ఎప్పుడు?

సాయిధరమ్‌ తేజ్‌: నీ వివాహం అయిన వెంటనే.. 

* చిన్న మామయ్య (పవన్‌ కల్యాణ్‌)తో కలిసి నటించారు. పెద్ద మామయ్య (చిరంజీవి)తో ఎప్పుడు?

సాయిధరమ్‌ తేజ్‌: ఆ అవకాశం కోసం నేనూ ఎదురుచూస్తున్నా.

* భవిష్యత్తులో మీరు రామ్‌చరణ్‌తో కలిసి నటించే అవకాశం ఉందా?

సాయిధరమ్‌ తేజ్‌: మంచి కథ కుదిరితే తప్పకుండా కలిసి నటిస్తాం. 

* ‘గాంజా శంకర్‌’ కాకుండా ఇంకేం సినిమాల్లో నటిస్తున్నారు?

సాయిధరమ్‌ తేజ్‌: ప్రస్తుతానికి ‘గాంజా శంకర్‌’ మాత్రమే చేస్తున్నా.

* మరోసారి మాస్‌ చిత్రంలో నటిస్తుండడం ఎలా అనిపిస్తోంది?

సాయిధరమ్‌ తేజ్‌: మాస్‌ జానర్‌ సినిమాలు నాకు ఇష్టం. అవి నన్ను మీకు బాగా దగ్గర చేస్తాయి. అందుకే మరోసారి అదే జానర్‌లో నటిస్తుండడం చాలా ఆనందంగా ఉంది.

* అర్జెంట్‌గా రూ. 10 లక్షలు కావాలి..

బ్రహ్మానందం నవ్వుతూ కనిపించే జిఫ్‌ ఇమేజ్‌ని పోస్ట్‌ చేశారు.

* మీరు నటించిన వాటిలో బాగా సంతృప్తి ఇచ్చిన పాత్రలేంటి?

సాయిధరమ్‌ తేజ్‌: చిత్ర లహరి, రిపబ్లిక్‌ సినిమాల్లోని పాత్రలు.

* పవన్‌ కల్యాణ్‌ గురించి ఒక్క మాటలో..

సాయిధరమ్‌ తేజ్‌: గురువు

* రొటీన్‌ చిత్రాలు కాకుండా ‘విరూపాక్ష’లాంటివి ప్రయత్నించండి.

సాయిధరమ్‌ తేజ్‌: అన్ని రకాల సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా. మీ అందరి ప్రేమ, మద్దతుతో మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి నా వంతు కృషి చేస్తా.

* ‘విరూపాక్ష’ పార్ట్‌ 2 ఎప్పుడు?

సాయిధరమ్‌ తేజ్‌: అది శాసనాల గ్రంథంలో చూసి చెప్పాలి!

* ఏదైనా సినిమా చిత్రీకరణ దశలో ఉన్న సమయంలో అది హిట్‌ అవుద్దా, ఫ్లాప్‌ అవుద్దా? అని ఆలోచించారా?

సాయిధరమ్‌ తేజ్‌: ఆ సందేహమే ఉంటే నా కెరీర్‌లో ఫ్లాప్‌ చిత్రాలే ఉండేవి కాదు కదా. ప్రతి సినిమా ఇష్టపడి చేస్తాం. దాన్నుంచి ఎంతో నేర్చుకుంటాం.

‘విరూపాక్ష’, ‘బ్రో’ (పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటించింది) సినిమాలతో విజయోత్సాహంలో ఉన్న సాయిధరమ్‌ తేజ్‌ ఈసారి ‘గాంజా శంకర్’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు సంపత్‌ నంది ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని