ట్రెండ్‌ సెట్‌ చేస్తోన్న సాయిపల్లవి, బన్నీ

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, సాయిపల్లవి యూట్యూబ్‌లో దూసుకెళ్తున్నారు. మిలియన్ల కొంది వ్యూస్‌తో ఈ ఇద్దరు తారలు ఎవరికి వారే సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తున్నారు..

Published : 23 Apr 2021 13:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, సాయిపల్లవి యూట్యూబ్‌లో దూసుకెళ్తున్నారు. మిలియన్ల కొంది వ్యూస్‌తో ఈ ఇద్దరు తారలు ఎవరికి వారే సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసుకుంటున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన సారంగదరియా పాట ఇప్పటికే విపరీతమైన ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. అతి తక్కువ సమయంలో ఎంతోమందిని ఆకర్షించింది. కాగా, తాజాగా ఈ పాట లిరికల్‌ వీడియో యూట్యూబ్‌లో 150 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుని సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘లవ్‌స్టోరీ’ విషయానికి వస్తే శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా సందడి చేయనున్నారు. ఈ నెలలో విడుదల కావాల్సిన ‘లవ్‌స్టోరీ’ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది.

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ యూట్యూబ్‌లో వీక్షకులను బాగా ఆకర్షిస్తోంది. బన్నీ-హరీశ్‌శంకర్‌ కాంబోలో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పటివరకూ 100 మిలియన్ల మంది వీక్షించారు. 2017లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బన్నీ-పూజాహెగ్డే జోడీ మొదటిసారి ఈ చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని