Prabhas: ‘సలార్‌’, ‘కల్కి’లపై వార్తలు.. ట్రెండింగ్‌లో ప్రభాస్‌..

‘సలార్‌’ (Salaar) టీమ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది.

Updated : 09 Jan 2024 15:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నో రోజుల నుంచి హిట్‌ కోసం ఎదురుచూస్తోన్న ప్రభాస్‌ అభిమానుల్లో ‘సలార్‌’ జోష్ నింపింది. దీంతో ‘బాక్సాఫీస్‌ స్టార్మ్‌’ పేరుతో చిత్రబృందం విజయోత్సవాలను నిర్వహించింది. ఈ వేడుకకు పృథ్వీరాజ్ సుకుమారన్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రభాస్‌ హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

మరోవైపు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ విడుదల తేదీపై వార్తలు వస్తున్నాయి. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను.. మే 9న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. ఆ సంస్థ అధినేత అశ్వనీదత్‌కు ఆ తేదీ సెంటిమెంట్‌ అని.. గతంలో వీళ్ల బ్యానర్‌పై వచ్చిన ‘మహానటి’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఇదే రోజు విడుదలై విజయాలు అందుకున్నాయని చెబుతున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో  అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌హాసన్‌ (Kamal Haasan) భాగం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాల వార్తలతో ప్రభాస్‌ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని