God Father: ‘గాడ్‌ఫాదర్‌’ సెట్లో సల్మాన్‌ఖాన్‌

చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘గాడ్‌ఫాదర్‌’లో సల్మాన్‌ఖాన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ముంబయిలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ కోసం రంగంలోకి దిగారు సల్మాన్‌ఖాన్‌.

Updated : 17 Mar 2022 08:16 IST

చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘గాడ్‌ఫాదర్‌’లో సల్మాన్‌ఖాన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ముంబయిలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ కోసం రంగంలోకి దిగారు సల్మాన్‌ఖాన్‌. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. దానికి సంబంధించిన ఫొటోని చిరంజీవి ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా రూపొందుతున్న సినిమా ఇది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌.బి.చౌదరి, ఎన్వీప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజకీయం నేపథ్యంలో సాగే కథ ఇది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని