Shaakuntalam: ఆమెకు శిక్షణ అవసరం లేదు.. తను పుట్టుకతోనే సూపర్‌ స్టార్‌: సమంత

‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమాలో అల్లు అర్జున్‌ గారాల కూతురు అల్లు అర్హ ప్రత్యేక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె నటనపై సమంత ఆసక్తికర కామెంట్స్‌ చేసింది.

Published : 26 Mar 2023 14:22 IST

హైదరాబాద్‌: సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శాకుంతలం’ (Shaakuntalam). ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే సమంత పలు ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాజాగా అల్లు అర్హ (Allu Arha) గురించి మాట్లాడింది.

‘‘అల్లు అర్హ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలదు. ఈ విషయంలో తన తల్లిదండ్రులను అభినందించాలి. ఎంత పెద్ద డైలాగైనా చాలా తేలికగా చెప్పేస్తుంది. తన సీన్‌ వచ్చినప్పుడల్లా ముచ్చటేసి నాకు తెలియకుండానే నవ్వుకునే దాన్ని. మొదటి రోజు షూటింగ్‌లో సుమారు 100 మంది చైల్డ్‌ ఆర్టిస్టులు పాల్గొన్నారు. అంతమందిలో కూడా అర్హ ఎలాంటి భయం లేకుండా తన డైలాగును ధైర్యంగా చెప్పింది. అర్హకు నటనలో శిక్షణ అవసరం లేదు. తను పుట్టుకతోనే సూపర్‌ స్టార్‌’’ అంటూ అర్హ నటనపై సమంత ప్రశంసలు కురిపించింది.

గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమా కోసం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రం ఐదు భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. మోహన్‌బాబు (Mohan Babu), గౌతమి (Gautami), ప్రకాష్‌ రాజ్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు అల్లు అర్హ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని