RRR Pre Release Event: పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌కి శాండీ మాస్టర్‌ స్టెప్.‌. జక్కన్న నవ్వులే నవ్వులు

రామ్‌చరణ్‌, తారక్‌, రాజమౌళిల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక శనివారం సాయంత్రం బెంగళూరులో ఘనంగా జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ..

Published : 20 Mar 2022 16:15 IST

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌, తారక్‌, రాజమౌళిల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక శనివారం సాయంత్రం బెంగళూరులో ఘనంగా జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో కోలీవుడ్‌ స్టార్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శాండీ మాస్టర్‌ తన స్టెప్పులతో మెప్పించారు. తారక్‌, చరణ్‌, రాజమౌళి కాంబోలో వచ్చిన సినిమాలను థీమ్‌గా తీసుకుని స్టేజ్‌ దద్దరిల్లేలా స్టెప్పులేశారు. ‘సింహాద్రి’, ‘యమదొంగ’, ‘మగధీర’లోని పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తోపాటు ‘నాటునాటు’ సాంగ్‌కు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఏ రాష్ట్రంలో ఈవెంట్‌ జరిగితే ఆ రాష్ట్ర భాషలో రాజమౌళి అక్కడివారిని పలకరిస్తున్న సంగతి తెలిసిందే. అదే విషయాన్ని శాండీ తన డ్యాన్స్‌తో ఆకట్టుకునేలా చూపించడంతో జక్కన్న నవ్వులు పూయించారు. డ్యాన్స్‌ పూర్తైన వెంటనే ముఖ్యమంత్రితోపాటు రామ్‌చరణ్‌, తారక్‌, రాజమౌళి.. శాండీని అభినందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని