Chiranjeevi: సత్యదేవ్‌.. నాకెంతో గర్వంగా ఉంది: చిరంజీవి

నటనలో వైవిధ్యాన్ని చూపించి, అనతికాలంలోనే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సత్యదేవ్‌ని మెగాస్టార్‌ చిరంజీవి మెచ్చుకున్నారు. సత్యదేవ్‌ని ప్రశంసిస్తూ శుక్రవారం ట్వీట్‌ చేశారు. చిరు ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’లో సత్యదేవ్‌...

Updated : 28 Apr 2022 15:13 IST

ట్వీట్‌ చేసిన మెగాస్టార్‌

హైదరాబాద్‌: నటనలో వైవిధ్యాన్ని చూపించి, అనతికాలంలోనే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సత్యదేవ్‌ని మెగాస్టార్‌ చిరంజీవి మెచ్చుకున్నారు. సత్యదేవ్‌ని ప్రశంసిస్తూ గురువారం ట్వీట్‌ చేశారు. చిరు ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’లో సత్యదేవ్‌ అతిథి పాత్ర పోషించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం ఉదయం సత్యదేవ్‌.. ‘‘అన్నయ్యా.. నటన, జీవితంలో మాలాంటి ఎందరికో మీరు ఆచార్య. ఒక అభిమానిగా చిరకాలం మీ పేరునే తలచుకుంటాను. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈ రోజు మీరు నటించిన ‘ఆచార్య’లో కొద్దిసేపైనా మీతోపాటు కలిసి స్క్రీన్‌షేర్‌ చేసుకునే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గరగా నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది’’ అని ట్వీట్‌ చేశారు.

కాగా, సత్యదేవ్‌ ట్వీట్‌పై చిరంజీవి స్పందించారు. ‘‘డియర్‌ సత్యదేవ్‌.. థ్యాంక్యూ. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషంగా ఉంది. ‘ఆచార్య’లో తక్కువ నిడివి గల పాత్రలోనైనా నువ్వు కనిపించడం కూడా ఆనందాన్ని ఇచ్చింది. ‘గాడ్‌ఫాదర్‌’లో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం గర్వకారణంగా ఉంది’’ అని చిరు రిప్లై ఇచ్చారు. మలయాళీ రీమేక్‌గా సిద్ధమవుతోన్న ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో సత్యదేవ్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని