Sebastian: ‘సెబాస్టియన్‌’గా కిరణ్‌ అబ్బవరం.. స్ఫూర్తినిచ్చేలా ‘రాజాధి రాజాధి రాజా’ గీతం

రేచీకటున్న పోలీసు కానిస్టేబుల్‌గా కిరణ్‌ అబ్బవరం నటించిన చిత్రం ‘సెబాస్టియన్‌ పీసీ 524’.

Updated : 07 Dec 2022 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రేచీకటి పోలీసు కానిస్టేబుల్‌గా కిరణ్‌ అబ్బవరం నటించిన చిత్రం ‘సెబాస్టియన్‌ పీసీ 524’. ఆ క్యారెక్టర్‌ తీరును తెలియజేసే గీతాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఎన్ని కష్టాలెదురైనా మానసిక స్థైర్యం కోల్పోకుండా అనుకున్నది సాధించాలనే స్ఫూర్తినిస్తుంది ఈ గీతం. ‘రాజాధి రాజాధి రాజో రాజా’ అనే హమ్మింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భరద్వాజ్‌ పాత్రుడు రచించిన ఈ పాటను పద్మలత ఆలపించారు. జిబ్రాన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో కిరణ్‌ సరసన నువేక్ష, కోమలీ ప్రసాద్‌ సందడి చేయనుంది. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని సిద్ధారెడ్డి బీ, రాజు, ప్రమోద్‌ నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని