Sekhar Master: చిరంజీవి, బాలకృష్ణలో ఉన్న కామన్ పాయింట్ అదే: శేఖర్ మాస్టర్
కొరియోగ్రాఫర్ శేఖర్ ఇంటర్వ్యూ. చిరంజీవి, బాలకృష్ణ గురించి ఆయన పలు విశేషాలు పంచుకున్నారు.
హైదరాబాద్: చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమాలు 2023 సంక్రాంతి బరిలో దిగనున్నాయి. జనవరి 12న బాలయ్య సినిమా, 13న చిరు చిత్రం విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా ఈ రెండు సినిమాలకు పనిచేసిన కొరియోగ్రాఫర్ శేఖర్ (Sekhar Master) తన అనుభవాలను విలేకరులతో పంచుకున్నారు. ఆ వివరాలివీ..
* చిరంజీవి, బాలకృష్ణలతో పని చేయడం ఎలా అనిపించింది?
శేఖర్: ఈ ఇద్దరి (Chiranjeevi) (Balakrishna) సినిమాలు సంక్రాంతికి విడుదలవుతాయనే సంగతి వాటికి పనిచేస్తున్నపుడు నాకు తెలియదు. అందుకే ఎలాంటి ఒత్తిడిలేకుండా స్టెప్పులు కంపోజ్ చేశా. ఇప్పుడు రెండు చిత్రాల్లోని పాటలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తుండటంతో టెన్షన్ పడుతున్నా (నవ్వుతూ..). మరోవైపు ఆనందంగా ఉంది.
* ఏ సినిమాలో ఎన్ని పాటలకు నృత్య రీతులు సమకూర్చారు?
శేఖర్: ‘వాల్తేరు వీరయ్య’లో అన్ని పాటలు, ‘వీరసింహారెడ్డి’లో రెండు పాటల(సుగుణ సుందరి, మా బావ మనోభావాలు)ను కంపోజ్ చేశా. నాకు 2023 సంక్రాంతి చాలా స్పెషల్. నాతోపాటు ప్రేక్షకులంతా ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
* చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి?
శేఖర్: ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ డెడికేషన్. ఓ మూమెంట్ చెబితే అది సరిగ్గా వచ్చేంత వరకూ విశ్రాంతి తీసుకోరు. ‘ఇలాంటి స్టెప్పులే కావాలి’ అని వారు అడగరు. ఏదైనా కొత్తగా చేయమని ప్రోత్సహించేవారు. సమయపాలన విషయంలోనూ ఇద్దరూ ఒకటే. అగ్ర హీరోలతో పనిచేయడం కంఫర్ట్‌గానే ఉంటుంది. అంచనాలు ఉన్నా దానికి తగ్గట్టు పనిచేస్తా.
* మెలొడీకి డ్యాన్స్ కంపోజ్ చేయడం సవాలా?
శేఖర్: అవును. ‘వాల్తేరు వీరయ్య’లోని ఓ మెలొడీని చిత్రీకరించేందుకు ఫారిన్ వెళ్లాం. ‘వీరసింహారెడ్డి’లోని సుగుణ సుందరి పాట కోసం టర్కీ వెళ్లాం. ఓ చోట బాగా చలి పెడితే మరో చోట ఎండలు మండిపోయేవి. సమస్యలను లెక్కచేయకుండా హీరోహీరోయిన్లు అద్భుతంగా డ్యాన్స్ చేశారు.
* ఈ తరం డ్యాన్స్ మాస్టర్లు సిగ్నేచర్ స్టెప్స్‌పై ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపిస్తోంది. దానిపై మీ అభిప్రాయం?
శేఖర్: ప్రస్తుతం సెల్‌ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. రీల్స్‌ను చూసేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు. అందులో కనిపించే ఒక్క మూమెంట్ నచ్చితే చాలు.. పూర్తి సాంగ్ ఎలా ఉంటుందోనన్న సంగతి తర్వాత. దాంతో సిగ్నేచర్ స్టెప్పు బాగుంటే ఆ పాట ప్రేక్షకులకు దగ్గరవుతుంది. సిగ్నేచర్ స్టెప్పు కచ్చితంగా ఉండాల్సిందే.
* కొరియోగ్రఫీ విషయంలో బీట్‌కు ప్రాధాన్యం ఇస్తారా, సాహిత్యానికా?
శేఖర్: అధిక శాతం బీట్‌కే ఉంటుంది. ఒకవేళ లిరిక్స్ బీట్‌ను డామినేట్ చేస్తుంటే రెండిటినీ పరిగణలోకి తీసుకుంటాం.
* ‘శేఖర్‌తో పనిచేయాలని ఉంది’ అని అగ్ర హీరోలు అనడంపై మీ స్పందన?
శేఖర్: చాలా సంతోషంగా ఉంటుంది. దాన్ని గాడ్ గిఫ్ట్‌గా భావిస్తా. నటన, దర్శకత్వంపై ప్రస్తుతానికి ఆసక్తిలేదు. నా దృష్టంతా కొరియోగ్రఫీ పైనే.
* కొరియోగ్రఫీ చేసేముందు మీరెలా సన్నద్ధమవుతారు?
శేఖర్: ముందుగా పాట బీట్ ఎలా ఉందో చూస్తా. ఆ తర్వాత హీరో బాడీ లాంగ్వేజ్‌కు ఎలాంటి స్టెప్పులు మ్యాచ్ అవుతాయో ఊహించుకుంటా. దానికి తగ్గట్టు ముందుకెళ్తా. కొన్నిసార్లు లొకేషన్లకు అనుగుణంగా చేయాల్సి వస్తుంది.
* ప్రస్తుతం ఏయే సినిమాలకు పనిచేస్తున్నారు?
శేఖర్: మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఓ చిత్రం, రవితేజ ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలకు పనిచేస్తున్నా.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
CM KCR: 23న ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
-
Crime News
Teenmar Mallanna: కానిస్టేబుళ్లపై దాడి కేసు.. చర్లపల్లి జైలుకు తీన్మార్ మల్లన్న
-
India News
Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో.. ప్రత్యేక బెంచ్‌కు సుప్రీం ఓకే
-
Movies News
Sreeleela: నేను మొదటి నుంచి బాలకృష్ణకు వీరాభిమానిని: శ్రీలీల
-
World News
London: భారత ప్రభుత్వం ప్రతిచర్య.. లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు