Shekar: ‘శేఖర్‌’ ట్రైలర్‌ వచ్చేసింది..!

‘‘ఇందుకి జరిగింది యాక్సిడెంట్‌ కాదు’’ అని అంటున్నారు నటుడు రాజశేఖర్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్‌’. జీవిత రాజశేఖర్‌ దర్శకురాలు. వేసవి...

Updated : 07 Dec 2022 16:06 IST

హైదరాబాద్‌: ‘‘ఇందూకి జరిగింది యాక్సిడెంట్‌ కాదు’’ అని అంటున్నారు నటుడు రాజశేఖర్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్‌’. జీవిత రాజశేఖర్‌ దర్శకురాలు. వేసవి కానుకగా మే 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో రాజశేఖర్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌గా యంగ్‌, ఓల్డ్‌ లుక్స్‌లో కనిపించనున్నారు. ‘‘పోలీస్‌ యూనిఫామ్‌ వేసుకొని కూడా డ్యూటీ చేయని వాళ్లు చాలామంది ఉంటారు. అదే, పోలీస్‌ ఉద్యోగానికి రిజైన్‌ చేసి కూడా డ్యూటీ కోసం ప్రాణాలిచ్చే వాళ్లు వేలల్లో ఒక్కరే ఉంటారు’’ అంటూ సమీర్‌ చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఇందులో రాజశేఖర్‌ కుమార్తె శివాని కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. మలయాళంలో విజయవంతమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘జోసెఫ్‌’కు రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని