RV Gurupadam: సీనియర్ నిర్మాత గురుపాదం కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్.వి.గురుపాదం (RV Gurupadam) కన్నుమూశారు.
ఇంటర్నెట్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ దిగ్గజం కె.విశ్వనాథ్ (K Viswanath), సీనియర్ దర్శకుడు సాగర్ (Sagar) మరణ వార్తలను మరవకముందే ప్రముఖ నిర్మాత ఆర్.వి.గురుపాదం (53) (RV Gurupadam) కన్నుమూశారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో బెంగళూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో చిత్రపరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది. సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. తెలుగులో తెరకెక్కిన ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, ‘పులి బెబ్బులి’ చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడలో సుమారు 25 చిత్రాలను ఆయన నిర్మించారు. హిందీలో శ్రీదేవి కథానాయికగా నటించిన ‘అకల్ మండ్’ చిత్రానికి గురుపాదం నిర్మాతగా వ్యవహరించారు. పలు తమిళ, మలయాళ చిత్రాలను తెలుగులోకి అనువాద చిత్రాలుగా తీసుకొచ్చారు. గురుపాదం మరణం పాట్ల దర్శకుడు రుషేందర్ రెడ్డి సహా పలువురు దర్శక నిర్మాతలు సంతాపం ప్రకటించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
OneWeb: వన్‌వెబ్ కాన్స్టలేషన్ సంపూర్ణం.. కక్ష్యలోకి 618 ఉపగ్రహాలు
-
Sports News
wWBC: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో లవ్లీనాకు స్వర్ణం
-
Movies News
Smriti Irani: ప్రెగ్నెంట్ అని తెలీదు.. షూట్ వల్ల అబార్షన్ అయ్యింది: స్మృతి ఇరానీ
-
Sports News
Nikhat Zareen: చాలా హ్యాపీగా ఉంది.. తర్వాతి టార్గెట్ అదే: నిఖత్ జరీన్
-
Politics News
Akhilesh: దేశంలో ప్రజాస్వామ్యం మనుగడపైనే ఆందోళన : అఖిలేష్
-
India News
Anand Mahindra: ‘సండే సరదా.. ఆ విషయాన్ని నేను మర్చిపోతా’