Sharwanand: మూడుముళ్లతో ఒక్కటైన శర్వానంద్-రక్షితా రెడ్డి
నటుడు శర్వానంద్ (Sharwanand) ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. రక్షితా రెడ్డిని ఆయన పెళ్లి చేసుకున్నారు.
హైదరాబాద్: నటుడు శర్వానంద్ (Sharwanand) సింగిల్ లైఫ్‌కు బై చెప్పారు. శనివారం రాత్రి రక్షితారెడ్డి మెడలో ఆయన మూడుముళ్లు వేశారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్, సిద్దార్థ్, ఆదితిరావు హైదరీతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
శర్వానంద్ సతీమణి రక్షిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఆమె తండ్రి మధుసూదన్‌రెడ్డి. తల్లి సుధారెడ్డి. ఇక, ‘ఒకే ఒక జీవితం’ విజయం తర్వాత శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్యతో ఒక ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఇంకా మొదలు కాలేదు. పెళ్లి పనుల నిమిత్తం శర్వా వర్క్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. త్వరలోనే ఆయన తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TS TET Results: రేపు టెట్ ఫలితాలు
-
ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
-
Imran khan: త్వరలో సకల సౌకర్యాలున్నజైలుకు ఇమ్రాన్
-
Chandrababu: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్
-
భాజపా ఎమ్మెల్యే నివాసంలో యువకుడి ఆత్మహత్య: ప్రియురాలితో గొడవే కారణం
-
చంద్రయాన్-3 మహా క్విజ్‌లో పాల్గొనండి