Sharwanand: ఈ ‘ఒకే ఒక జీవితం’ సినిమాకే అంకితం..: శర్వానంద్
హీరో శర్వానంద్ (Sharwanand) సినీ ప్రయాణం మొదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హృదయపూర్వక నోట్‌ను విడుదలచేశారు. తనని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు.
హైదరాబాద్: టాలీవుడ్ (Tollywood)లో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ (Sharwanand) ఒకడు. విభిన్న కథలను ఎంచుకుంటూ మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఈ హీరో. నేటితో శర్వానంద్ సినీ జీవితం ప్రారంభమై 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో తనని ఆదరిస్తున్న ప్రేక్షకుల కోసం హృదయపూర్వక నోట్‌ను విడుదల చేశాడు.
‘‘20 ఏళ్లుగా ఎన్నో పాత్రలు చేస్తూ, వెండితెరపై అందరినీ అలరిస్తున్నాను. భావోద్వేగాలతో నిండిన ఈ ప్రయాణంలో 20 సంవత్సరాల స్నేహం, కష్టాలు, ఎత్తులు, లోత్తులు, చిరునవ్వులు.. ఇలా ఎన్నో ఉన్నాయి. అచంచలమైన ప్రేమ, మద్దతుతో నా ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ 20 సంవత్సరాలు నా జీవితాన్ని, నా వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మలిచాయి. నా ఈ ‘ఒకే ఒక జీవితం’ సినిమాకే అంకితం. 20 సంవత్సరాల క్రితం ‘శ్రీకారం’ చుట్టిన ఈ సినీ ‘ప్రస్థానం’ మరపురానిది, మరవలేనిది. ఈ సినీ లోకంలో నా ‘గమ్యం’ ఎంతో దూరం. మిమ్మల్ని అలరించడం కోసం ప్రతి క్షణం ‘రన్ రాజా రన్’ (Run Raja Run)లా పరుగులు తీస్తూనే ఉంటాను. కృషి చేస్తూనే ఉంటాను. ‘శతమానం భవతి’ (Shatamanam Bhavati) అంటూ మీరు నాకు ఇచ్చే ఆశీస్సులతో ఇది సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను’’ అని అందులో పేర్కొన్నారు. అలాగే తన తర్వాత సినిమా (#Sharwa35)కు సంబంధించిన ప్రకటన కూడా చేశారు. శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైందని అన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
TATA IPL 2023: ఐపీఎల్ వ్యాఖ్యాతగా నందమూరి బాలకృష్ణ
-
Politics News
Azad: రాహుల్‌పై వేటు: ఇలాగైతే.. పార్లమెంట్, అసెంబ్లీలు ఖాళీయే: ఆజాద్
-
Sports News
MIW vs DCW: ముగిసిన దిల్లీ ఇన్నింగ్స్.. ముంబయి లక్ష్యం 132
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
OneWeb: వన్‌వెబ్ కాన్స్టలేషన్ సంపూర్ణం.. కక్ష్యలోకి 618 ఉపగ్రహాలు
-
Sports News
wWBC: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో లవ్లీనాకు స్వర్ణం