Ram charan: రామ్‌చరణ్‌ చిత్రంలో శివరాజ్‌ కుమార్‌

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా... బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ 16వ చిత్రమిది. ఈ ఏడాది వేసవి ఆరంభంలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Updated : 06 Jan 2024 09:15 IST

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా... బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ 16వ చిత్రమిది. ఈ ఏడాది వేసవి ఆరంభంలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇందులో ఓ కీలక పాత్రని కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ పోషించనున్నారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో శివరాజ్‌ కుమార్‌ స్వయంగా వెల్లడించారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం. విజయ్‌ సేతుపతి, జాన్వీ కపూర్‌, త్రిష తదితర తారలూ ఇందులో ఉంటారని గతంలో వినిపించింది. విజయవంతమైన ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ కథలో క్రీడా నేపథ్యం కూడా కీలకమని సమాచారం. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూర్చనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని