Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నుంచి శ్రీరాపాక ఎలిమినేట్‌

ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ నాన్‌ స్టాప్‌’. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న

Published : 14 Mar 2022 01:54 IST

హైదరాబాద్‌: ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ నాన్‌ స్టాప్‌’. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో నుంచి నటి శ్రీరాపాక ఎలిమినేట్‌ అయ్యారు. రెండో వారం నామినేషన్స్‌లో సరయు, హమీదా, అనిల్‌ రాథోడ్‌, మిత్ర శర్మ, అరియానా, నటరాజ్‌, అఖిల్‌, శివ, శ్రీ రాపాక, అషు ఉండగా.. అతి తక్కువ ఓట్లు వచ్చిన శ్రీరాపాక ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అంతకుముందు ఇంటి సభ్యులకు నాగార్జున క్లాస్‌ తీసుకున్నారు. వారం రోజులుగా జరిగిన పరిణామాలపై చర్చించారు. యాంకర్‌ శివ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని