Siddu Jonnalagadda: ‘ఇంటింటి రామాయణం’.. ఆ జాబితాలోకి చేరుతుంది: సిద్ధు జొన్నలగడ్డ
నరేశ్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకకు సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: మంచి కంటెంట్ ఉన్న ‘బలగం’, ‘మేమ్ ఫేమస్’ వంటి చిత్రాల జాబితాలోకి ‘ఇంటింటి రామాయణం’ (Intinti Ramayanam) చేరుతుందని, మంచి విజయం అందుకుంటుందని యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ఆకాంక్షించారు. సినిమాల విషయంలో ఖర్చు ఎక్కువ, తక్కువ ఉండొచ్చు గానీ పెద్దా చిన్నా అనే తేడా లేదన్నారు. కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ కర్షియల్‌గాను హిట్ అవుతున్నాయని అన్నారు. ఆ సినిమా ట్రైలర్ విడుదల వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ బాగుందని, ఆ సినిమాలో ఫ్యామిలీ డ్రామాను చూపించారని తెలిపారు. విజయవంతమయ్యే చిత్రాల్లో ఉండే అంశాలన్నీ ఆ సినిమాలో ఉన్నాయన్నారు. ఆ చిత్ర దర్శకుడు సురేశ్.. భవిష్యత్తులో ఫైట్లు ఉన్న సినిమా తీయాలని ఆకాంక్షించారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘‘సురేశ్.. మూలాల్లోకి వెళ్లి తీసిన సినిమా ఇది. బాగా తెరకెక్కించాడు. బలగం సినిమాలో చూపించినట్టు తెలంగాణ సంస్కృతిని చూపించనున్నాడు’’ అని తెలిపారు. నరేశ్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. మారుతి టీమ్, నిర్మాత నాగవంశీ, ‘ఆహా’ స్టూడియో సమర్పణలో ఈ నెల 9న విడుదల కానుంది. నేరుగా ఓటీటీ ‘ఆహా’లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Varalaxmi Sarathkumar: డ్రగ్స్ కేసు.. నాకు ఎలాంటి సంబంధం లేదు: వరలక్ష్మి శరత్‌కుమార్
-
Talasani Srinivas: చంద్రబాబు అరెస్టు చాలా బాధాకరం: మంత్రి తలసాని
-
Tejas Aircraft: వాయుసేన చేతికి తొలి తేజస్ ట్విన్ సీటర్ విమానం
-
Kiran Abbavaram: రతిక లాంటి భార్య.. కిరణ్ అబ్బవరం ఏమన్నారంటే..?
-
Nara Lokesh: అప్పటివరకూ లోకేశ్‌ను అరెస్టు చేయొద్దు: సీఐడీకి హైకోర్టు ఆదేశం
-
Sky bus: స్కైబస్లో కేంద్రమంత్రి గడ్కరీ టెస్టు రైడ్.. త్వరలో ఆ బస్సులు భారత్‌కు!