Kiara-Sidharth: వధువుగా మెరిసిన కియారా.. మురిసిపోయిన సిద్ధార్థ్‌.. వెడ్డింగ్‌ వీడియో వైరల్‌

కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్‌ మల్హోత్ర (Sidharth Malhotra) పెళ్లి వీడియో నెట్టింట సందడి చేస్తోంది. అది చూసిన నెటిజన్లు కామెంట్స్‌లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందమైన ఆ వీడియోను మీరు చూసేయండి.

Updated : 10 Feb 2023 21:47 IST

ముంబయి: బాలీవుడ్‌ నటులు కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్‌ మల్హోత్ర (Sidharth Malhotra) మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ సూర్యఘడ్‌ ప్యాలెస్‌లో వీరి వివాహం కన్నుల పండువగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటైన ఈ జంట వారి పెళ్లి వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఆనందంతో డాన్స్‌ వేస్తూ కియారా పెళ్లి వేదికపైకి రాగా.. తనను చూసిన సిద్ధార్థ్‌ సంతోషంతో ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించాడు. వారి ఆనందక్షణాల వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. వీడియో (Kiara wedding video) చూసిన అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘చూడ ముచ్చటైన జంట’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఫ్యాన్స్‌తోపాటు సినీ, క్రీడా ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆశీస్సులు తెలుపుతున్నారు.

‘షేర్షా’ (Shershaah) సినిమాతో వెండితెరపై ఈ జంట సూపర్‌జోడిగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమా పూర్తయిన కొద్దిరోజులకే  వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత పలు ఈవెంట్స్‌ల్లో వీరిద్దరూ కలిసి కనిపించడం, కలిసి విహారయాత్రలకు వెళ్లిన ఫొటోలు పలుమార్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని