Singer Sunitha: రామ్‌.. మాంచి కాఫీ లాంటి అబ్బాయ్‌: సునీత

తన భర్త రామ్‌ మంచి మనసున్న వ్యక్తి అని గాయని సునీత అన్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రామ్‌తో తనకున్న అనుబంధంపై ఆమె స్పందించారు. ఈ ఏడాది కాలం ఎన్నో మధురమైన అనుభూతులు...

Published : 09 Jan 2022 12:47 IST

వివాహ వార్షికోత్సవం.. మధుర జ్ఞాపకాలు షేర్‌ చేసుకున్న గాయని

హైదరాబాద్‌: తన భర్త రామ్‌ మంచి మనసున్న వ్యక్తి అని గాయని సునీత అన్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రామ్‌తో తనకున్న అనుబంధంపై ఆమె స్పందించారు. ఈ ఏడాది ఎన్నో మధురమైన అనుభూతులు అందించిందన్నారు. ఈ మేరకు తన వివాహ వేడుక జ్ఞాపకాలతో పొందుపరిచిన ఓ స్పెషల్‌ వీడియోని ఆమె ఆదివారం షేర్‌ చేశారు.  ఈ వీడియోలో సునీత వాళ్లమ్మ మాట్లాడుతూ.. ‘‘సునీత.. బరువు బాధ్యతలన్నీ తీర్చుకుంటూ చిరునవ్వు, సహనంతో జీవితంలో ముందడుగు వేసింది. డేరింగ్‌, అండ్‌ డైనమిక్‌ పర్సనాలిటీ. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇక రామ్‌ గురించి సునీత మాట్లాడుతూ.. ‘‘రామ్‌ ముక్కుసూటి మనిషి. సుమారు ఎనిమిదేళ్ల నుంచి నాకు తెలుసు. మాంచి కాఫీ లాంటి అబ్బాయ్‌’’ అంటూ ఆమె చిరునవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘కంగ్రాట్స్‌.. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని కామెంట్లు పెడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని