Chiranjeevi: అతడికంటే నువ్వు అందగాడివా? అని చులకనగా చూశారు: చిరంజీవి
ప్రైవేట్ ఆల్బమ్స్‌తో గాయనిగా ఎన్నో ఏళ్లపాటు సంగీత ప్రియులను అలరించారు స్మిత (Smita). ప్రస్తుతం ఆమె వ్యాఖ్యాతగా సినీ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సోనీలివ్ వేదికగా ‘నిజం విత్ స్మిత’ (Nijam With Smita) అనే కార్యక్రమానికి ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్: ఇండస్ట్రీలో తనకు గాడ్‌ఫాదర్స్ లేరని.. కేవలం స్వయంకృషితోనే ఈ స్థాయికి రాగలిగానని అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని తాను ఈ స్టేజ్‌లోకి వచ్చానని తెలిపారు. మద్రాస్‌కు వెళ్లిన కొత్తలో ఓ వ్యక్తి తనని చూసి.. ‘నువ్వేం అందగాడివి?’ అంటూ ఎద్దేవా చేశాడని చెప్పారు. ప్రముఖ గాయని స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం’ (Nijam) కార్యక్రమంలో పాల్గొన్న చిరు ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఓ ఏడాది అటు వైపు వెళ్లలేదు..!
‘‘పరిశ్రమలోకి ప్రవేశించి.. నటుడిగా ఈ స్థాయికి వచ్చే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. కొన్ని సందర్భాల్లో మానసిక క్షోభకు గురయ్యాను. నా బాధను ఎవరితోనూ పంచుకోలేదు. అన్నింటికీ నన్ను నేను సమాధానపరచుకొని మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చేవాడిని. ఇండస్ట్రీలోకి రావాలనే ఆశతో మద్రాస్‌కు వచ్చిన కొత్తలో ఓసారి పాండిబజార్‌కు వెళ్లాను. అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి..‘‘ఏంటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోకి వచ్చావా? సినిమాల్లోకి ప్రయత్నిద్దామనేనా? అతడిని చూడు ఎంత అందంగా ఉన్నాడో.. అతడి కంటే నువ్వు అందగాడివా? తెలిసినవాళ్లు లేకపోతే పరిశ్రమలోకి రావడం కష్టమే..! కాబట్టి నీ కలను మర్చిపో’’ అని హేళనగా మాట్లాడాడు. ఆ మాటలు నన్ను బాధకు గురి చేశాయి. ఇంటికి వెళ్లిపోయి దేవుడి ముందు కూర్చొని.. ఇలాంటి వాటికి బెదరకూడదని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ఏడాదిపాటు ఆ పాండిబజార్ వైపు వెళ్లలేదు. ఇప్పుడు ఎవరైనా నన్ను విమర్శిస్తే నేను వాటిని పట్టించుకోను. చూసి నవ్వుకుంటాను. గుర్తింపు పొందడం కోసమే ఆ వ్యక్తి అలా మాట్లాడుతున్నాడని అనుకుంటా’’
24 గంటలు భయపడ్డా..!
‘‘నేను నటించిన పాత సినిమాలు చూస్తే నా మెడలో హనుమంతుడి వెండి లాకెట్‌తో కూడిన ఓ గొలుసు ఉంటుంది. గతంలో ఆ లాకెట్ మా నాన్నకు ఎక్కడో దొరికితే.. దాన్ని తీసుకువచ్చి నా మెడలో వేశారు. కెరీర్ మొదలైన సమయంలో అదే నన్ను కాపాడుతుందని గట్టిగా నమ్మాను. ఓ సినిమా షూట్లో అది ఎక్కడో పడిపోయింది. ఆరోజు చాలా కంగారుపడ్డా. రోజంతా నిద్రపోలేదు. భయాందోళనకు గురయ్యాను. ఆ తర్వాత అది దొరికింది. కానీ, ‘అన్నయ్య’ (Annayya) సినిమా షూట్లో దాన్ని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు’’
నా మాటలు నచ్చలేదు..!
‘‘ప్రశంసలకు పొంగిపోకూడదని, విమర్శలకు కుంగిపోకూడదని.. ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. స్టార్‌గా ఉన్నప్పుడు ప్రశంసలే కాదు విమర్శలూ ఎదురవుతాయని స్వతహాగా తెలుసుకున్నాను. ‘ప్రజారాజ్యం’ స్థాపించి జగిత్యాలలో యాత్ర చేస్తోన్న తరుణంలో అక్కడవారు నాపై పూలవర్షం కురిపించారు. అదే సమయంలో కొంతమంది కోడిగుడ్లూ విసిరారు. నా మాటలు నచ్చకపోవడం వల్లే వాళ్లు ఇలా చేసి ఉండొచ్చు. ఇదే జీవితమంటే.. విమర్శలు.. ప్రశంసలను సమానంగా తీసుకుని ముందుకు అడుగువేసినవాడే నాయకుడు’’ అని చిరంజీవి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
త్రిగుణ్ కీలక పాత్రలో నటించిన ‘లైన్ మ్యాన్’ మూవీ ప్రస్తుతం తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది -
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాధవన్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన ‘షైతాన్’ ఓటీటీలోకి రానుంది. -
‘పంచాయత్ సీజన్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
‘పంచాయత్ సీజన్ 3’ వెబ్‌సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే? -
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. -
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కొత్తదనం నిండిన రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మమితా బైజు నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ప్రణయ విలాసం’. ఈటీవీ విన్ వేదికగా ఇది ప్రసారం కానుంది. -
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
తండేల్ మూవీ ఓటీటీ డీల్ పూర్తయింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్‌కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్‌సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
ఈటీవీ విన్లో ఆకట్టుకుంటోన్న క్రైమ్ కామెడీ చిత్రం
ఈటీవీ విన్ వేదికగా విడుదలైన 'శర్మ & అంబానీ' ప్రేక్షకాదరణ పొందుతోంది. -
ఓటీటీలో ‘గామి’ సరికొత్త రికార్డు.. ఎన్ని మిలియన్ల వీక్షణలంటే..
‘గామి’ ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ జీ5 సంస్థ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. -
ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కన్నడ నటుడు దర్శన్ (Darshan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాటేరా’ (Kaatera) -
ఓటీటీలోకి ‘భీమా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘భీమా’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కీర్తి సురేశ్ ఎమోషనల్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
కీర్తి సురేశ్ నటించిన ‘సైరన్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. -
‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్‌పై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
అఖిల్ నటించిన ‘ఏజెంట్’ ఓటీటీ విడుదలపై నిర్మాత మరోసారి స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!