బాలకృష్ణ నిలువుటద్దంలాంటి వ్యక్తి: బోయపాటి

తెలుగు చిత్రసీమకు మూల స్తంభంగా భావించే నటుల్లో నందమూరి బాలకృష్ణది ప్రత్యేక స్థానం. తెరపై నటుడిగా తన అభిమానులను అలరించే బాలయ్య.. తెర వెనుక ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్‌ హీరో అనిపించుకున్నారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Updated : 28 Jun 2021 20:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చిత్రసీమకు మూల స్తంభంగా భావించే నటుల్లో నందమూరి బాలకృష్ణది ప్రత్యేక స్థానం. తెరపై నటుడిగా తన అభిమానులను అలరించే బాలయ్య.. తెర వెనుక ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్‌ హీరో అనిపించుకున్నారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందరూ ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖులు కూడా బాలకృష్ణ అంటే ఎంతో గౌరవిస్తారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతి త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘శ్రేయాస్‌ గ్రూప్‌’ బాలయ్యబాబు గురించి ఒక ప్రత్యేక వీడియో తయారు చేసి అభిమానులతో పంచుకుంది. బాలకృష్ణ గొప్పతనం గురించి ఎవరేం మాట్లాడారో ఆ వీడియోలో పొందుపరిచారు.

బోయపాటి శ్రీను: బాలకృష్ణ నిలువుటద్దంలాంటి వ్యక్తి. ఆయన ముందుకు వచ్చి ఎవరెలా కనిపిస్తే ఆయన అలా కనిపిస్తారు.  

పూరి జగన్నాథ్‌: బాలయ్యబాబుకు ఒక క్యారెక్టర్‌ ఉంది. మాట మీద నిలబడతారు. మనుషులకు విలువిస్తారు. 

కోడి రామకృష్ణ: నిజాన్ని నిజంగా చెప్తాడు. పాత్ర నచ్చిందంటే జీవిస్తాడు. ఇంకెవరూ చేయలేరనిపిస్తుంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌: బాలయ్య.. ఆయనకు కొడుకులు తక్కువ.. అభిమానులు ఎక్కువ.. మీ అందరితో పాటే నేను.

కల్యాణ్‌రామ్‌: మన బాలయ్య.. మా బాబాయ్‌.

తారకరత్న: తాతగారి తర్వాత ఈ రోజు కూడా నందమూరి అని చెప్పుకొని తిరుగుతున్నాం. ఆ బరువు బాధ్యతలు.. పేరు ప్రఖ్యాతులను భుజం మీద వేసుకొని నడిపిస్తున్న ఒకే ఒక వ్యక్తి నందమూరి బాలకృష్ణ.

అభినవ్‌ గొమటం: తన జనరేషన్‌కు సంబంధం లేని వాళ్లకు కూడా స్ఫూర్తి కలిగిస్తారు.

బాలకృష్ణను చూస్తుంటే ఎన్టీఆర్‌ను చూసినట్లే అనిపిస్తుందని మరి కొంతమంది సీనియర్‌ సినీ నటులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ‘అఖండ’ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌ కీలకపాత్ర పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని