Sumalatha: మరణించినప్పటికీ నువ్వు నాలోనే ఉన్నావు: సుమలత
తన భర్త అంబరీష్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు నటి సుమలత. ఈమేరకు ఆమె సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
ఇంటర్నెట్‌డెస్క్: తన భర్త అంబరీష్‌ను (Ambareesh) గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు నటి సుమలత (Sumalatha). వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆమె ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘గాలిలో నీ మాట విని నిన్ను చూద్దామని వెనక్కి తిరిగి చూశా.. ఆ సూర్యుడి వేడిలో నీ స్పర్శను అనుభూతి చెందా.. ఆ వెచ్చదనానికి అలాగే కూర్చొండిపోయా..! ఈ రోజు నా మనసు నిన్ను మరెంతగానో గుర్తు చేసుకుంటుంది. నీతో ఉన్న క్షణాలు గుర్తుకు వచ్చాయి. నువ్వు మరణించి ఉండొచ్చు కానీ నాలో ఎప్పటికీ భాగమే. ఈ సూర్యుడు, గాలి, వర్షం.. ఉన్నంతవరకూ నువ్వు నాలోనే ఉంటావు. నా మనసుకు ఇది తెలుసు’’ అని సుమలత రాసుకొచ్చారు. కన్నడ చిత్రం ‘ఆహుతి’తో పరిచయమైన సుమలత-అంబరీష్.. 1991లో వివాహం చేసుకున్నారు. అనారోగ్య కారణాల తో 2014లో అంబరీష్ మృతి చెందారు. గురువారం తమ 31వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సుమలత ఈ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Coca Cola Phone : కోలా ఫోన్ కాదు.. కోకాకోలా స్పెషల్ ఎడిషన్.. ఫీచర్లివే!
-
Politics News
BJP: భాజపా కీలక నిర్ణయం.. సీఎంపై పోటీకి మాజీ మిలిటెంట్ నేత
-
Sports News
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ని వీక్షించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chandrababu: వైఎస్ వివేకా హత్య.. జగన్ ఇప్పుడు తప్పించుకోలేరు: చంద్రబాబు
-
Movies News
Pathaan: ‘వైఆర్‌యఫ్ స్పై యూనివర్స్’లో ‘పఠాన్’ నంబరు 1.. కలెక్షన్ ఎంతంటే?