సంగీత ప్రపంచంలోకి సురేశ్‌ ప్రొడక్షన్స్‌

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 1964లో ప్రారంభమై, ఎన్నో వైవిధ్యభరిత చిత్రాల్ని ప్రేక్షకులకి అందించిన ఈ సంస్థ ఇకపై సంగీత ప్రియుల్నీ అలరించేందుకు సిద్ధమైంది.

Published : 24 Jun 2021 14:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 1964లో ప్రారంభమై, ఎన్నో వైవిధ్యభరిత చిత్రాల్ని ప్రేక్షకులకి అందించిన ఈ సంస్థ ఇకపై సంగీత ప్రియుల్నీ అలరించేందుకు సిద్ధమైంది. ‘సురేశ్‌ ప్రొడక్షన్స్‌ మ్యూజిక్‌’ పేరుతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ‘మన సినిమాల్లో సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాన్ని గుర్తించే సురేశ్‌ ప్రొడక్షన్స్‌ మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్‌ని తీసుకొస్తున్నాం. ఈ ప్లాట్‌ఫామ్‌ మీద వినసొంపైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఇది మ్యూజికల్‌ పవర్‌హౌజ్‌లా ఉంటుంది’ అని తెలియజేస్తూ సంబంధిత లోగోని విడుదల చేసింది సురేశ్‌ ప్రొడక్షన్స్‌. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. రామానాయుడు నెలకొల్పిన సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బాధ్యతల్ని ఆయన తనయుడు సురేశ్‌ బాబు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ‘నారప్ప’, ‘దృశ్యం 2’ చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని