Suriya: రోలెక్స్‌.. నా ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసింది: సూర్య

కార్తి (Karthi) నటించిన ‘జపాన్‌’ (Japan) ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం వేడుకగా జరిగింది. ఇందులో సూర్య అతిథిగా పాల్గొన్నారు.

Updated : 29 Oct 2023 14:22 IST

చెన్నై: కార్తి (Karthi) హీరోగా నటించిన కొత్త చిత్రం ‘జపాన్‌’ (Japan). రాజు మురుగన్‌ దర్శకుడు. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ శనివారం చెన్నైలో జరిగింది. ఇందులో సూర్య పాల్గొన్నారు.

‘‘నా తమ్ముడు కార్తి నటించిన 25వ చిత్రమిది. నాకు ‘సింగం’ ఎంతటి విజయాన్ని అందించిందో.. కార్తికి ‘జపాన్‌’ అంతటి ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. నా తదుపరి చిత్రం ‘కంగువా’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా అద్భుతంగా సిద్ధమవుతోంది. అభిమానులు తప్పకుండా సెలబ్రేట్‌ చేసుకుంటారు. లోకేశ్‌ కనగరాజ్‌ ఇచ్చిన ‘రోలెక్స్‌’ పాత్ర పూర్తిగా నా కెరీర్‌నే మార్చేసింది. ‘దిల్లీ(ఖైదీ 2)’ ఎప్పుడైతే రిటర్న్‌ అవుతాడో.. అదే సమయంలో రోలెక్స్‌ కూడా తిరిగి వస్తాడని నేనూ వింటున్నా’’ అని సూర్య అన్నారు.

Vishwak Sen: తగ్గేకొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారు.. : విశ్వక్‌సేన్‌ వైరల్‌ పోస్ట్‌

అనంతరం కార్తి మాట్లాడుతూ.. ‘‘మణిరత్నం వద్ద అసిస్టెంట్‌గా నా కెరీర్‌ మొదలుపెట్టా. అభిమానులు చూపించిన ప్రేమ, ఆదరణ వల్లే నేను ఇక్కడి వరకూ రాగలిగా. నాతో కలిసి ఓ సినిమా చేయాలని ఇప్పటివరకూ ఏ దర్శకుడిని అడగలేదు. కానీ, రాజు మురుగన్‌ని మాత్రం అడిగా. రిపోర్టర్‌ నుంచి ఆయన దర్శకుడిగా మారారు. ‘జపాన్‌’ నాకెంతో నచ్చి చేసిన చిత్రం. అద్భుతమైన కంటెంట్‌ను వినోదభరితంగా చూపించారు. సూర్య అన్న నాకు స్ఫూర్తి’’ అని తెలిపారు.

తమిళనాడులోని అనేక బంగారు దుకాణాల నుంచి కొన్ని కిలోల బంగారాన్ని దొంగలించిన ఓ వ్యక్తి కథ ఆధారంగా ‘జపాన్‌’ కథను తీర్చిదిద్దారు. ఇందులో కార్తి బంగారం స్మగ్లింగ్‌ చేసే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. కామెడీ జోడించి, కొత్త అవతారంలో ఆయన అలరించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ స్వరాలందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని