Suriya: రోలెక్స్‌ రాక ఖాయం

కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమా ముగింపులో రోలెక్స్‌ అనే ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మురిపించారు కథానాయకుడు సూర్య. ఆ పాత్రపై ఓ సినిమా రానున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి.

Updated : 14 Aug 2023 11:37 IST

మల్‌హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమా ముగింపులో రోలెక్స్‌ అనే ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మురిపించారు కథానాయకుడు సూర్య. ఆ పాత్రపై ఓ సినిమా రానున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడీ విషయంపై సూర్య స్వయంగా స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఆ చిత్ర కథను కూడా చెప్పినట్లు వెల్లడించారు. ఆదివారం ఫ్యాన్స్‌ మీట్‌లో పాల్గొన్న ఆయన తన తదుపరి ప్రాజెక్ట్స్‌ విశేషాల్ని పంచుకున్నారు. ‘‘ప్రస్తుతం నేను ‘కంగువా’ పనుల్లో బిజీగా ఉన్నా. అది మేము ఊహించిన దాని కంటే అద్భుతంగా వస్తోంది. అక్టోబరు నుంచి నా 43వ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలనుకుంటున్నాం. దర్శకుడు వెట్రిమారన్‌ ‘విడుదలై-2’ చిత్రీకరణలో ఉన్నారు. ఆయన ఆ చిత్రం పూర్తి చేసిన తర్వాత మా కలయికలో ‘వాడి వసల్‌’ మొదలవుతుంది. లోకేష్‌ రోలెక్స్‌పై కథ చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. త్వరలో అది ప్రారంభమవుతుంది. ఇది పూర్తయ్యాక ‘ఇరుంభుకై మాయావి’ చేస్తాం’’ అన్నారు సూర్య.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని