Surya: పాన్‌ ఇండియా చిత్రంగా సూర్య ‘ఈటి’!

కోలీవుడ్‌ హీరోనే అయినా.. టాలీవుడ్‌ హీరోలతో సమానంగా తెలుగు అభిమానులను సంపాదించుకున్న నటుడు సూర్య. ఇటీవల ఆయన నటించిన ‘జై భీమ్‌’ సూపర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగు, తమిళంలోనే కాదు.. హిందీ అనువాదంలోనూ మంచి విజయం సాధించింది. దీంతో సూర్య తదుపరి సినిమాలను కూడా

Updated : 14 Dec 2021 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ హీరోనే అయినా.. టాలీవుడ్‌ హీరోలతో సమానంగా తెలుగు అభిమానులను సంపాదించుకున్న నటుడు సూర్య. ఇటీవల ఆయన నటించిన ‘జై భీమ్‌’ చిత్రం ఓటీటీలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. దక్షిణాది భాషల్లోనే కాదు.. హిందీ అనువాదంలోనూ మంచి విజయం సాధించింది. దీంతో సూర్య తదుపరి సినిమాలను కూడా పాన్‌ ఇండియాగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తాజాగా సూర్య నటిస్తోన్న చిత్రం.. ఈటి(ఎతర్‌క్కుమ్‌ తునిందవన్). సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో పాండిరాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే, ఈ చిత్రాన్ని ఐదు (తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ) భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు సినిమా పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. ఈ చిత్రంలో సూర్యకి జోడిగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తోంది. వినయ్‌రామ్‌, సత్యరాజ్‌, జయప్రకాశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. పాండిరాజ్‌ దర్శకత్వంలో సూర్యకి ఇది రెండో సినిమా. ఇది వరకు వీరి కాంబినేషన్‌లో పసంగా-2: హైకూ చిత్రం తెరకెక్కింది. 2015లో వచ్చిన ఈ చిత్రం తెలుగులో ‘మేము’గా విడుదలైంది.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని