Surya42: సూర్య సినిమాలోని సన్నివేశాలు లీక్‌.. యాజమాన్యం ఏమందంటే...!

సూర్య హీరోగా దర్శకుడు శివ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. సూర్య సరసన దిశాపటానీ నటిస్తుంది. ఇంకా పేరు ఖరారు కాని  ఈ చిత్రం(Surya42)లోని పలు వీడియోలు, ఫొటోలు లీక్‌ అయ్యాయి.

Updated : 26 Sep 2022 14:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూర్య హీరోగా దర్శకుడు శివ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. సూర్య సరసన దిశాపటానీ నటిస్తోంది. ఇంకా పేరు ఖరారు కాని  ఈ చిత్రం(Surya42)లోని పలు వీడియోలు, ఫొటోలు లీక్‌ అయ్యాయి. దీనిపై చిత్ర బృందం ట్విటర్‌ వేదికగా స్పందించింది.

‘‘సూర్య చిత్రంలోని పలు సన్నివేశాలు, ఫొటోలు లీక్‌ అయ్యాయని మా దృష్టికి వచ్చింది. ఏ సినిమాలోనైనా ప్రతి భాగం కొన్ని వందల మంది చెమట, రక్తంతో కూడుకుని ఉంటుంది. మేము ఈ సినిమా చూసే ప్రేక్షకులకు ఓ అద్భుతమైన అనుభూతిని కలిగించాలనుకుంటున్నాం.  మీరు లీక్‌ చేసిన వాటిని తొలగించండి. అలా చేయకపోతే చట్టపరమైన  చర్యలు తీసుకుంటాం.’’ అని ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ఓ పరాక్రమవంతుడి కథగా రూపొందుతున్న ఈ  త్రీడి చిత్రం 10 భాషల్లో విడుదలవ్వనుంది.  డీఎస్పీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్‌  నిర్మాతలుగా స్టూడియో గ్రీన్‌, యు.వి క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని