కరోనాతో సినీ దర్శకుడు మృతి

కరోనా మహమ్మారి మరొకరిని బలి తీసుకుంది. ప్రముఖ కోలీవుడ్‌ సినీ దర్శకుడు తమిర(53) కరోనాతో మృతి చెందారు. 20 రోజుల క్రితం ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. చికిత్స కోసం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తీసుకున్నప్పటికీ వైరస్‌ మహమ్మారి నుంచి కోలుకోలేకపోయారు.

Published : 27 Apr 2021 23:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి మరో సినీ ప్రముఖుడిని బలి తీసుకుంది. ప్రముఖ కోలీవుడ్‌ సినీ దర్శకుడు తమిర (53) కరోనాతో మృతి చెందారు. 20 రోజుల క్రితం ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. చికిత్స కోసం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తీసుకున్నప్పటికీ వైరస్‌ మహమ్మారి నుంచి కోలుకోలేకపోయారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన ఆస్పత్రిలోనే మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. బాలచందర్‌, భారతీరాజ వంటి దిగ్గజాలతో కలిసి తమిర పనిచేశారు. ఇటీవల హాస్యనటుడు వివేక్‌ను కోల్పోయిన తమిళ పరిశ్రమ ఇంకా ఆ విషాదం నుంచి కోలుకోనేలేదు. తాజాగా తమిర మరణ వార్త ఇండస్ట్రీని మరింత కుంగదీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని