Sonu Sood: సోనూసూద్‌ నివాసంలో ఐటీ విభాగం సోదాలు

ప్రముఖ నటుడు సోనూసూద్‌కు చెందిన ముంబయిలోని నివాసంలో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహించింది. అలాగే ముంబయిలో ఆయనకు....

Updated : 15 Sep 2021 18:58 IST

దిల్లీ: ప్రముఖ నటుడు సోనూసూద్‌కు చెందిన ముంబయిలోని నివాసంలో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహించింది. అలాగే ముంబయిలో ఆయనకు సంబంధించిన మరికొన్ని చోట్ల, లఖ్‌నవూలోని కంపెనీలో ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం సంబంధిత వర్గాలు మీడియా వెల్లడించాయి. ఆదాయ వివరాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.

దిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘దేశ్‌ కే మెంటార్స్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌ సోనూసూద్‌ ఇటీవల నియమితులైన సంగతి తెలిసిందే. దానికింద పాఠశాల విద్యార్థులకు మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ నియామకం జరిగిన కొద్ది రోజులకే సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో రాజకీయాల్లో చేరడం గురించి ఆయన్ను ప్రశ్నించగా.. మంచిపని చేయడానికి రాజకీయాల్లోనే చేరాల్సిన పనిలేదన్నారు. దానిపై స్పష్టత ఇవ్వడానికి నిరాకరించారు. 

కొవిడ్ వేళ.. ఆపన్నులకు అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. గతేడాది లాక్‌డౌన్ సమయంలో వలసకార్మికులను ఇళ్లకు చేర్చేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. దాంతో ఇప్పటికీ ఎంతోమంది సాయం కోసం ఆయన్ను ఆశ్రయిస్తూనే ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు