Akhanda: సెట్‌ ఫిక్సైంది.. బాలయ్య సినిమా క్లైమాక్స్ షురూ అయ్యింది..!

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకుడు. ఇటీవల ఈ సినిమా క్లైమాక్స్‌ షూట్‌ కోసం చిత్రబృందం లొకేషన్స్‌ వేటలో పడిన విషయం....

Published : 23 Jul 2021 15:13 IST

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకుడు. ఇటీవల ఈ సినిమా క్లైమాక్స్‌ షూట్‌ కోసం చిత్రబృందం లొకేషన్స్‌ వేటలో పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడులోని ఓ పురాతన ఆలయంలో క్లైమాక్స్ చిత్రీకరణ చేసేందుకు నిర్ణయించుకుంది. కాగా, శుక్రవారం ఉదయం క్లైమాక్స్‌ షూట్‌ షురూ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ ఫొటోని అందరితో పంచుకుంది. ఇందులో బాలయ్యకు సీన్‌  వివరిస్తూ బోయపాటి కనిపించారు. స్టంట్‌ మాస్టర్‌ శివ నేతృత్వంలో జరగనున్న ఈ షూట్‌లో సినిమాలోని కీలక పాత్రధారులందరూ పాల్గొననున్నారు.

‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయిక. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన వేరియేషన్స్‌లో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని