Gamanam Review: రివ్యూ: గమనం
శ్రియ ప్రధాన పాత్రలో నటించిన గమనం చిత్రం ఎలా ఉందంటే..
చిత్రం: గమనం; నటీనటులు: శ్రియా శరణ్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, సుహాస్, నిత్యమేనన్ (అతిథి పాత్రలో), రవి ప్రకాశ్, బిత్తిరి సత్తి, సంజయ్ స్వరూప్, తదితరులు; సంగీతం: ‘మాస్ట్రో’ ఇళయరాజా; ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్.వి.ఎస్; సంభాషణలు: సాయి మాధవ్ బుర్రా; కూర్పు: రామకృష్ణ అర్రమ్; నిర్మాతలు: రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్; కథ, కథనం, దర్శకత్వం: సుజనా రావు; సంస్థ: క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్; విడుదల: 10 డిసెంబర్ 2021
తెలుగులో అగ్రతారల సినిమాల జోరు మొదలైంది. ఇంకొన్ని రోజుల్లో ఆ ఉద్ధృతి మరింతగా పెరగనుంది. అందుకే ఆలోపులోనే పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పోటీ పడుతున్నారు దర్శకనిర్మాతలు. ఈవారం దాదాపుగా ఎనిమిది సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి ‘గమనం’. దర్శకులుగా సుజనారావుకి ఇదే తొలి చిత్రమైనా.. శ్రియ, నిత్యమేనన్ తదితర తారలు ఉండటం, సినిమా వెనక కూడా ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, ఛాయాగ్రాహకుడు జ్ఞానశేఖర్, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా తదితరులు పనిచేయడంతో సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ప్రచార చిత్రాలు కూడా సినిమాపై ఉత్సుకతని రేకెత్తించాయి. మరి చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం.
కథేంటంటే: మూడు కథల సమాహారం ఈ చిత్రం. కమల(శ్రియ) చెవులు వినబడని ఓ దివ్యాంగురాలు. దుబాయ్‌కి వెళ్లిన భర్త కోసం ఎదురుచూస్తూ చంటి బిడ్డతో కలిసి ఓ మురికివాడలో కాలం వెళ్లదీస్తుంటుంది. చెవులు వినిపించేందుకని వైద్యం కూడా చేయించుకుంటుంది. భర్త మాటలు వినాలని తహతహలాడుతుంది. రెండో కథలో క్రికెటర్ కావడమే లక్ష్యంగా శ్రమిస్తున్న అలీ (శివ కందుకూరి), తన పక్కింటి అమ్మాయి జారా (ప్రియాంక జవాల్కర్)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మూడో కథలో పుట్టినరోజంటే ఏమిటో తెలియని అనాథ పిల్లలైన ఇద్దరు కేక్ కోసమని రూ.300 సంపాదించాలనుకుంటారు. అనుకోకుండా వచ్చిన ప్రకృతి విపత్తుతో ఆ మూడు కథలు ఎలాంటి మలుపులు తిరిగాయి. వాళ్లు కన్న కలలు నెరవేరాయా? లేదా? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే: మూడు కథలు.. వాటిని ప్రకృతి విపత్తుతో ముడిపెట్టి రాసిన తీరు బాగుంది. కథలకి ముగింపు ఆలోచన కూడా ఆకట్టుకునేదే. ఎటొచ్చీ ఈ కథల గమనమే ఏ దశలోనూ మెప్పించదు. కాన్సెప్ట్ బాగుంటే చాలదు.. దాన్ని తెరపైన నడిపించడంలోనూ ప్రత్యేకత ప్రదర్శించాల్సిందే. ఈ సినిమా విషయంలో అదే లోపించింది. ప్రథమార్ధం మొత్తం పాత్రల్ని, వారి నేపథ్యాల్ని పరిచయం చేసి వదిలేసినట్టే ఉంటుంది తప్ప, అందులో కథేమీ ఉండదు. ఇక ఉన్న ఓ చిన్న మలుపుని కూడా ట్రైలర్లోనే చూపించడంతో సినిమాలో చూడటానికి ఏమీ మిగల్లేదనిపిస్తుంది. మూడు కథల్ని పరిచయం చేసిన విధానం కూడా డాక్యుమెంటరీ తరహాలో నిదానంగా.. చప్పగా సాగడం సినిమాకి మైనస్‌గా మారింది. వీధి బాలలు, మురికివాడల జీవితాన్ని సహజంగా ఆవిష్కరించిన తీరు మాత్రం మెప్పిస్తుంది. హైదరాబాద్ వరదలతో ఈ కథని తీర్చిదిద్దడంతో కొద్దిలో కొద్దిగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. కానీ ఆ కథల్ని హృద్యంగా మలచడంలో దర్శకురాలు విఫలమయ్యారు. ఆమెకి ఇదే తొలి చిత్రం కాబట్టి అనుభవ లేమి అడుగడుగునా కనిపిస్తుంది. అయితే అనుభవం ఉన్న పలువురు సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో ఉన్నా వాళ్ల ప్రభావం కూడా పెద్దగా కనిపించదు. సాయిమాధవ్ బుర్రా కలం మెరుపులు ఒకట్రెండు చోట్ల కనిపిస్తాయంతే. ఇళయరాజా సంగీతం పతాక సన్నివేశాల్లోనే ప్రభావం కనిపిస్తుంది. జ్ఞానశేఖర్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. దర్శకురాలు సుజనారావు రాసుకున్న పాత్రల్లో బలం ఉంది. వాటిలో సంఘర్షణే సరిపడలేదు.
ఎవరెలా చేశారంటే: సినిమాకి ప్రధాన ఆకర్షణ శ్రియనే. ఆమె పాత్ర, నటనే సినిమాకి బలం. చెవులు వినిపించని ఓ గృహిణిగా చక్కటి అభినయం ప్రదర్శించింది. భర్త రాడని తెలిసినప్పుడు ఆమె పండించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ జోడీ మధ్య సాగే లవ్ ట్రాక్‌లో బలం లేదు. వాళ్ల నటన కూడా అంతంత మాత్రమే. పతాక సన్నివేశాల్లో శివ కందుకూరి అభినయం పర్వాలేదనిపిస్తుంది. వీధి బాలలుగా నటించిన ఇద్దరు చిన్నారులు ఆకట్టుకుంటారు. చారు హాసన్, సంజయ్ స్వరూప్, సుహాస్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఇంత పెద్ద ఇల్లు కట్టారంటే, ఎంత చెత్త ఏరుకున్నారో అంటూ వీధి బాలలుతోనూ, మర్యాదగా మమ్మల్ని మట్టిలో కలిపేస్తావనుకుంటే, మా మర్యాదనే మట్టిలో కలిపేశావ్ అని వృద్ధ దంపతులతోనూ చెప్పించిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. జ్ఞానశేఖర్ కెమెరా వరదల్ని, మురికివాడల్ని చాలా బాగా చూపించింది. సుజనారావు రాసుకున్న కథ పర్వాలేదు కానీ, దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానమే మెప్పించదు. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టు ఉంది.
బలాలు
+ శ్రియ నటన
+ పతాక సన్నివేశాలు
బలహీనతలు
- సాగదీతగా సన్నివేశాలు
- భావోద్వేగాలు పండకపోవడం
చివరిగా: గమనం.. ఓ ప్రయత్నం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
Prathinidhi 2 Review: నారా రోహిత్ కీలక పాత్రలో నటించిన ‘ప్రతినిధి2’ ప్రేక్షకుల మెప్పించిందా? -
రివ్యూ: ఆవేశం.. రూ.150 కోట్లు వసూలు చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన మలయాళ సూపర్‌హిట్ మూవీ ‘ఆవేశం’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
baak movie review: ‘అరణ్మనై’ సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన ‘బాక్’మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
aa okkati adakku review: అల్లరి నరేష్, ఫరియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది?
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM