Liger: లైగర్‌.. రిలీజ్‌ డేట్‌ ప్రకటించేశారు..!

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్‌-సాలా క్రాస్‌ బ్రీడ్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ని..

Published : 16 Dec 2021 11:41 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ని గురువారం ఉదయం చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు వచ్చే ఏడాది ఆగస్టు 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే డిసెంబర్‌ 31న స్పెషల్‌ గ్లిమ్స్ విడుదల చేయనున్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్‌ కిక్‌ బాక్సర్‌ పాత్రలో కనిపించనున్నారు. అనన్య పాండే కథానాయిక. ఛార్మి నిర్మాత. మరోవైపు విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ 2017లో ఆగస్టు 25నే విడుదలై ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని