
Vijay Sethupathi: ఉత్కంఠగా ‘పిజ్జా 2’ ట్రైలర్
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ సేతుపతి, గాయత్రి, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పురియత పుథిర్’. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా తమిళ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని, ఘన విజయం అందుకుంది. ఇప్పుడు తెలుగు వారిని అలరించేందుకు సిద్ధమైంది. వివిధ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్ని ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ తెలుగులో డబ్ చేసి, విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘పురియత పుథిర్’ని ‘పిజ్జా 2’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. సెప్టెంబరు 3 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదలైంది. ప్రేమ, నేరానికి సంబంధించిన సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. నాయకానాయికల హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ఈ సినిమాకి సంగీతం: సామ్ సి.ఎస్, ఛాయాగ్రహణం: దినేశ్ కృష్ణన్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.