Bigg Boss Telugu 5: ‘బిగ్‌బాస్‌’లో ఊహించని ట్విస్ట్‌.. హౌస్‌ నుంచి సిరి ఎలిమినేట్‌?

మరో రెండు రోజుల్లో ముగియనున్న బిగ్‌బాస్‌ సీజన్‌-5(Bigg Boss Telugu 5) నుంచి సిరి ఎలిమినేట్‌ అయింది.

Updated : 17 Dec 2021 16:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మరో రెండు రోజుల్లో ముగియనున్న బిగ్‌బాస్‌ సీజన్‌-5(Bigg Boss Telugu 5)లో ఊహించని ట్విస్ట్‌. హౌస్‌ నుంచి సిరి(siri) ఎలిమినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం.. ఇంటి సభ్యులందరూ తమ బట్టలు సర్దుకుని గార్డెన్‌ ఏరియాకు రమ్మని బిగ్‌బాస్‌(bigg boss) ఆదేశించాడు. ‘ఈ ఇంట్లో మీలో ఒకరి ప్రయాణం ఈ క్షణమే ముగుస్తుంది. బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లే ఆ ఒక్కరు ఎవరని మీరు అనుకుంటున్నారు’ అని అడిగాడు. ‘నా అభిప్రాయం ప్రకారం షణ్ముఖ్‌(shanmukh).. ఊహాగానాలు చాలా ఎక్కువ చేస్తున్నాడు’ అని మానస్‌(Manas) అనగా, మిగతా వాళ్లతో పెద్దగా గొడవలు కాలేదంటూ సన్నీ(sunny) పేరును షణ్ముఖ్ సూచించాడు. ‘హౌస్‌మేట్స్‌ అనగానే ఒకరితో ఒకరికి ఇంటరాక్షన్‌ ముఖ్యం. ఉన్న నలుగురిలో సిరితో నాకు ఇంటరాక్షన్‌ తక్కువ. కాబట్టి ఆమెనే అనుకుంటున్నా’ అని శ్రీరామ్‌(sri ram) అన్నాడు. ఇక సన్నీ.. షణ్ముఖ్‌ పేరును సూచించాడు. అందరి అభిప్రాయాలు విన్న బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్తున్న వ్యక్తి ‘సిరి’ అని చెప్పాడు. దీంతో సిరి కంగుతింది. తాను ఇంటి నుంచి బయటకు వెళ్లనని అంది. డోర్లు ఓపెన్‌ చేయడంతో సిరి, షణ్ముఖ్ బాధపడుతూ కనిపించారు. మరి సిరి నిజంగానే బయటకు వెళ్లిందా? లేదా ఏదైనా టాస్కా? సీక్రెట్‌ రూమ్‌లో ఉంచారా? తెలియాల్సి ఉంది. ఆదివారంతో బిగ్‌బాస్‌ సీజన్‌-5 ముగియనుంది.

Read latest Cinema News and Telugu News



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని